Site icon vidhaatha

Lady Aghori | లేడీ అఘోరి చెర నుంచి శ్రీ వర్షిణి వెనక్కి..!

విధాత: లేడీ అఘోరీ ఆధీనంలో ఉన్న మంగళగిరి యువతిని ఎట్టకేలకు కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ అఘోరీపై మంగళగిరి పోలీస్ట్ స్టేషన్‌లో కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన కూతురు శ్రీ వర్షిణిని అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొన్నిరోజులుగా శ్రీవర్షిణి.. అఘోరీ వద్దనే ఉంటోంది. ‘నాకు తల్లిదండ్రులు’ వద్దు అని చెబుతోంది. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చెర నుంచి విడిపించారు. గుజరాత్ లో శ్రీవర్షిణి ఆచూకి గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే తనకు కుటుంబ సభ్యుల వెంట వెళ్లడం ఇష్టం లేదని.. నన్ను బలవంతంగా తీసుకెళుతున్నారంటూ శ్రీ వర్షిణి వాపోయింది. ప్రస్తుతం శ్రీ వర్షిణిని కుటుంబ సభ్యులు ఏపీకి తీసుకెళ్లారు. అయితే .. మ‌రోవైపు శ్రీ వర్షిణిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళగిరి పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version