Site icon vidhaatha

Congress | దేశానికి దిక్సూచి నాడు బెంగాల్‌.. నేడు తెలంగాణే

మంత్రులు పొన్నం, సురేఖ..పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

విధాత: మ‌న దేశానికి దిక్సూచిగా నాడు బెంగాల్ ఉంటే… నేడు తెలంగాణే అని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్లు పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ కేబినెట్ జన గణనతో పాటు కులగణన చేయాలన్న నిర్ణ‌యంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక దృక్ప‌థం క‌లిగిన తెలంగాణ ప్ర‌భుత్వం ఒత్తిడితోనే కేంద్ర ప్ర‌భుత్వం కుల‌గ‌ణ‌న‌కు అంగీకారం తెలిపింద‌ని వారు అన్నారు.

ఇది తమ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆశ‌, ఆశ‌య‌మ‌ని..తమ రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల కృషి అని పేర్కొన్నారు. కులగణన నిర్ణయం ప‌ట్ల బీసీ బిడ్డ‌లుగా.. బీసీ మంత్రులుగా ఎంత‌గానో సంతోష ప‌డుతున్న‌ట్టు వారు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు.

కాంగ్రెస్‌ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు దారిలోకి రావడం శుభ పరిణామని..ప్రజాభీష్టానికి లొంగి కులగణనను చేపట్టాలని నిర్ణయంచిన కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాలని టీపిసిసి చీఫ్ డిమాండ్ చేశారు.

Exit mobile version