న్యూఢిల్లీ: ఢిల్లీ(Delhi)పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో భేటీ అయ్యారు. వారికి తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన, తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుల అంశాలను ఖర్గే, రాహుల్ కు రేవంత్ రెడ్డి వివరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఇండియా కూటమి తరుపున కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతరం పార్లమెంటులో ఇండియా కూటమి పార్టీల నేతలతో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు.
సాయంత్రం కాంగ్రెస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు ఇందిరా భవన్ లో కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రక్రియను దేశానికి రోల్ మోడల్ గా రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ లో వివరించనున్నారు.