విధాత: రాజధాని అమరావతి (Amaravati)లో సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయంలో 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు, 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. హెచ్‌వోడీ కార్యాలయానికి రూ. 1,126 కోట్లతో ఒక టవర్ నిర్మాణానికి మరో టెండరును పిలిచింది. మొత్తం 5 టవర్లకు గానూ రూ. 4,668 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సచివాలయంలో ఉండే హెచ్‌వోడీలకు సంబంధించి 45 అంతస్థులతో ఒక టవర్ నిర్మాణం, మిగతా టవర్లు 40 అంతస్థులతో నిర్మాణం జరుగనున్నాయి. ఈ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల గడువు విధించింది. తాజాగా ఏపీ మంత్రివర్గం శాసనసభ, హైకోర్టు, సచివాలయం పనులు ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు హెవోడీ టవర్ల నిర్మాణాల టెండర్లు పిలవగా..రాజధాని నిర్మాణంలో ఇది కీలక పురోగతిగా కూటమి ప్రభుత్వం చెబుతోంది.