Site icon vidhaatha

భారత్ కీలక నిర్ణయం..ఇక ఉగ్రదాడి యుద్ధ చర్యనే: ప్రధాని మోదీ

విధాత, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర దాడినైనా దేశంపై ‘యుద్ధ చర్య’గా పరిగణించాలని, దానికి తగువిధంగా స్పందించాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లతో హైలెవల్ సమావేశం నిర్వహించారు.

ప్రధాని మోదీకి ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ దాడులు, భారత ఆర్మీ చర్యలను వివరించారు. సమావేశంలో పాకిస్తాన్ దాడుల తీరుతెన్నులను చర్చించారు. ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరించాలని..పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని.. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Exit mobile version