Site icon vidhaatha

ICICI రుణం కాదు.. TGIIC బాండ్ల డబ్బులు: మంత్రి శ్రీధర్ బాబు

విధాత : హెచ్ సీయూ భూములపై ప్రభుత్వం ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకోలేదని..టీజీఐఐసీ బాండ్లతో రూ.8476కోట్ల డిపాజిట్ అమౌంట్ తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం హెచ్ సీయూ భూముల వివాదంపై ఆయన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హెచ్ సీయూ భూములపై ప్రభుత్వం తీసుకున్న మొత్తంలో రుణమాఫీ కోసం రూ.2146 కోట్లు, రైతు భరోసా కోసం రూ.5463 కోట్లు, సన్నవడ్ల బోనస్ కోసం రూ.947 కోట్లు పథకాలకు వెచ్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మాపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఈసీ, పీఎఫ్ సీ, బీవోబీల నుంచి 10.09% కు రుణం తీసుకుందన్నారు. తాము బీఆర్ ఎస్ కంటే తక్కువ ఇంట్రెస్టుకు తీసుకున్నామని తెలిపారు. 5200 కోట్ల భూమిని 30వేల కోట్లకు చూపించారని కేటీఆర్ అంటున్నాడని. సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం 23వేల కోట్ల వాల్యూ వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

సెబీ, ఆర్బీఐ నిర్దారణ చేసిందని, భూములపై ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వలేదన్నారు. హెచ్ సీయూ భూమిపై సుప్రీం కోర్టులో ఏవిధమైన వాజ్యాలు లేవని, టీజీఐఐసీ మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుండి మ్యూచువల్ పెట్టుబడులు బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించిందన్నారు. తక్కువ ఇంట్రెస్ట్ తో ప్రభుత్వ సంక్షేమం కోసం నిధులు సేకరించామని తెలిపారు. డివేంచేర్ ట్రస్టీ హెచ్ సీయూ భూములు ప్రభుత్వానియేనని క్లీయర్ గా చెప్పిందన్నారు. 5వ తేదీ డిసెంబర్ 2024 లో రూ. 9,995 కోట్ల బాండ్ల ద్వారా నిధులను ప్రభుత్వం సేకరించిందన్నారు. 9.35 ఇంట్రెస్ట్ తో నిధులు సేకరణ జరిగిందన్నారు. సెబీలో రిజిస్టర్ అయిన మర్చంట్ బ్యాంకర్ ను టీజీఐఐసీ నియమించుకుందన్నారు. ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులు సమకూర్చిందని తెలిపారు.

అభివృద్ధికి అడ్డం పడుతున్న బీఆర్ఎస్

అభివృద్ధిని అడ్డుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర సంక్షేమానికి విరోధులుగా తయారైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసన్నారు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లను హెచ్ సీయూ చనిపోయినట్లు చూపించారని విమర్శించారు. ఏనుగులు హెచ్ సీయూ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా చూపించారన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని శ్రీధర్ బాబు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దురదృష్టితో 400 ఎకరాలను అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాద్యతాయుతంగా పని చేయాలని మూసీ ప్రక్షాళన చేస్తున్నామని, ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని, మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. మూసీ అభివృద్ధిలో సైతం అన్ని వర్గాల వారు ఉన్నారన్నారు. దురుద్ధేశాలతో అభివృద్ధికి కులాన్ని అపాదించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల మేం సబర్మతికి వెళ్లి విజిట్ చేశామమని, సబర్మతి పరివాహక ప్రాంత వాసులకు మేలు జరగాలి అని బీజేపీ అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అదే అభివృద్ధి తెలంగాణ హైదరాబాద్ మూసీలో బీజేపీ వద్దు అంటుందని శ్రీధర్ బాబు తప్పు బట్టారు. మీడియా ప్రతినిధులను సబర్మతికి తీసుకుని వెళ్ళండని, మీడియా అకాడమీ చైర్మన్ కి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సబర్మతి నది అభివృద్ధికి ముందు అభివృద్ధికి తరువాతి పరిస్థితులను సేకరించండని, మూసీ అభివృద్ధిలో ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version