విధాత: చాలా గ్యాప్ తర్వాత టీవీ యాంకర్, ప్రెజెంటర్ ప్రదీప్ మాచిరాజు ( Pradeep Machiraju), మరో యాంకర్, నటి దీపిక పిల్లి (deepika pilli) జంటగా నటిస్తోన్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. గతంలో జబర్దస్త్, ఢీ వంటి రియాలిటీషోలకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్‌లు ఈ సినిమాతో డైరెక్టర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే ఈ మూవీ విడుదలకు రెడీ అవడంతో మేకర్స్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈకోవలోనే తాజాగా బుధవారం ‘టచ్‌లో ఉండు మీ శీతాకాలం సరోజ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఈపాటను ప్రదీప్, చంద్రిక రవిలపై చిత్రీకరించగా అస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాదాన్ సంగీతం అందించారు. 2025 ఫిభ్రవరి గానీ మార్చిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.