ఆదివారం వరంగల్‌లో ఇరువురి వివాహం
విధాత, వరంగల్ : వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ దూపం సంపత్ -పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ గత ఐదు సంవత్సరాల క్రితం ఫామ్ డి కోర్స్ చేసి పై చదువుల కొరకు అమెరికాలోని ఇండియానా వెళ్ళింది. అదే కాలేజీలో చదువుతున్న అమెరికా అబ్బాయి గ్రాండ్, సుప్రియ ఇద్దరు ప్రేమించుకున్నారు.
గ్రాండ్ తల్లి నాన్సీ మయర్ తండ్రి జెప్ మయర్ తల్లిదండ్రులను ఒప్పించి వరంగల్లో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. 16-03-2025 ఆదివారం రోజున ఉదయం 10:45 నిమిషాలకు కీర్తి గార్డెన్స్ లో ప్రేమజంట ఒకటికానున్నారు. ఈ వివాహానికి గ్రాండ్ చెల్లెలు కూడా హాజరవుతున్నట్లు సమాచారం.