Site icon vidhaatha

మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి : నేటి యువతకు జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం మార్గదర్శం

about-jaipal-reddy-political-legacy-speech-by-ponnam-komati-reddy

జైపాల్ రెడ్డి వల్లే హైదరాబాద్‌కు మెట్రో వచ్చింది.

ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలి.

విధాత, హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 6వ వర్థంతి సందర్భంగా స్మృతి స్థల్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి చివరి వరకు తన జీవితాంతం పారదర్శంకంగా కొనసాగారన్నారు. నేటి యువతకు ఆయన రాజకీయ జీవితం ఆదర్శమని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జైపాల్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చి బెస్ట్ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందారన్నారు.

తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర ఎంతో ముఖ్యమైనదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు ఆయనవల్లే మెట్రో వచ్చిందన్నారు. వారి స్ఫూర్తితోనే నల్గొండ నుంచి తాను 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు. జైపాల్ రెడ్డితో, వారి కుటుంబ సభ్యులతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని కోమటిరెడ్డి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టామని, ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్రప్రభత్వాన్ని కోరుతున్నామన్నారు.

Exit mobile version