విధాత,హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రేసులో నేను కూడా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నపుడు టికెట్ ఎందుకు ఆశించకూడదు? అని ప్రశ్నించారు. నా కుమారుడు కష్టపడి ఎంపీ అయ్యాడని..ఊరికే తనకి టికెట్ ఇవ్వలేదన్నారు. తెలంగాణాలో బీసీ సామాజిక వర్గం నుంచి నేను జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నానని స్పష్టం చేశారు. నా ఇంట్లో తండ్రీ.. కొడుకులం పార్టీకి సేవ చేస్తుంటే జీతం మాత్రమే ఒక్కరికే ఇస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం జరిగిన చర్చల్లో నాకు అన్యాయం చేయమని అధిష్టానం మాట ఇచ్చిందని…ఇపుడు దానిని నిలబెట్టుకోవాలని..నాకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని కోరారు.