గజ్వేల్‌లో నర్సారెడ్డి దాడికి పాల్పడ్డారు
నలుగురు సభ్యులతో కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి అంశం విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, పార్టీ లోని కొందరు సీనియర్ల నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటి ఛైర్మన్, ఎంపీ మల్లు రవి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణా కమిటీ దృష్టికి తీసుకు వచ్చారని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మంగళవారం క్రమశిక్షణా కమిటీ మరోసారి సమావేశం అవుతుందని, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చిస్తామని తెలిపారు.
కాగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలపై సీనియర్ నాయకులతో కమిటీ వేయమని టీపీసీసీ చీఫ్‌కు వేయమని లేఖ రాశామని మల్లు రవి వెల్లడించారు. గజ్వేల్ దగ్గర డీసీసీ నర్సారెడ్డి దాడి చేశాడని, దానిపై వివరాలు సేకరించామన్నారు. ఈ ఘటన ఇంచార్జీ మంత్రి వివేక్ సమక్షంలో జరిగిందని, ఆయనను అడిగి వివరాలు సేకరిస్తామన్నారు. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ కన్వీనర్‌గా శ్యాం మోహన్ ఉంటారన్నారు.