Site icon vidhaatha

బీజేపీ ఎంపీ ఈటల : మీరు ఓడితేనే ఓట్ల చోరీ జరిగినట్లా

etela-rajender-slams-congress-vote-theft-claims-security-risk

దేశ భద్రతను పణంగా పెట్టడం కరెక్ట్ కాదు
కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఈటల విమర్శలు

విధాత : ఓట్లు, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. ఇక్కడ కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయన్నారు. మీరు గెలిస్తే మిషన్లు పని చేసినట్లు.. ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్లా అని ఈటల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకోవాలని ఈటల విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ స్వాతంత్ర సంస్థ అని సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. వాటి ప్రకారం నిర్ణయాలు ఉంటాయి తప్ప దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని ఈటల నిలదీశారు. ఓట్ల చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.. ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన అని దుయ్యబట్టారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారినప్పుడు వారి ఓట్లను సరి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుందని తెలిపారు. ఓట్ల నమోదు, డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. బీహార్ బార్డర్ ఉన్న ప్రాంతం అని ఇక్కడికి బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉందని, అలా వచ్చిన వారికి ఆధార్ కార్డులు, దేశ పౌరసత్వం కల్పించడం దేశానికి క్షేమం కాదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డాక్టర్​ నమ్రత

కాళేశ్వరం కల నిజమవుతుందా?.. మేడిగడ్డ పునరుద్ధరణకు ప్రభుత్వం కసరత్తు

Exit mobile version