విధాత: మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని అధికారులు సూచించారు.
ఇటీవల IAS అధికారి అర్వింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా ఆయన్ను ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.