Site icon vidhaatha

RamChander Rao | బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్

ramchander-rao-bjp-telangana-president-house-arrest

RamChander Rao | విధాత, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావును తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్తారనే సమాచారంతో ఆయనను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఇటీవల పెద్దమ్మ ఆలయాన్ని దుండగుడు ధ్వంసం చేయడంతో వివాదం తలెత్తింది. నేడు పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చన చేయాలని బీజేపీ నేతల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రామచందర్ రావును ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రామచందర్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మరవైపు పార్టీ పరంగా మంగళవారం రామచందర్ రావు సికింద్రాబాద్, గోషామహాల్ నియోజకవర్గాల్లో హర్ ఘర్ తిరంగా యాత్రలలో పాల్గొనాల్సి ఉంది. రామచందర్ రావు హౌస్ అరెస్టుపై బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై గత ప్రభుత్వం మాదిరిగానే ముందుస్తు అరెస్టులతో నిర్భంధం విధిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

భ‌యంక‌ర ఘ‌ట‌న‌.. 14 ఏండ్ల బాలిక‌పై 200 మంది లైంగికదాడి..!

ఈ మూడు తేదీల్లో జ‌న్మించిన వారికి.. ప్రేమ పెళ్లిళ్లు క‌లిసి రావ‌ట‌..!

Exit mobile version