Site icon vidhaatha

Love Marriages | ఈ మూడు తేదీల్లో జ‌న్మించిన వారికి.. ప్రేమ పెళ్లిళ్లు క‌లిసి రావ‌ట‌..!

Love Marriages | చాలా మంది జీవితం వారి పుట్టిన తేదీ( Birth Date ), స‌మ‌యం, నెలపై ఆధార‌ప‌డి ఉంటుంది. న్యూమ‌రాల‌జీ( Numerology ) ప్ర‌కారం.. ఒక వ్య‌క్తి పుట్టిన తేదీని ఆధారం చేసుకుని వారి కేరీర్‌తో పాటు గుణ‌గ‌ణాలు తెలుసుకోవ‌చ్చు. వారు జీవితంలో స‌క్సెస్ అవుతారా..? భ‌విష్య‌త్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..? మ‌రి ముఖ్యంగా పెళ్లిళ్లు( Marriages ), ప్రేమ పెళ్లిళ్ల( Love Marriages ) వంటి విష‌యాల‌ను కూడా న్యూమ‌రాల‌జీ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

అయితే ఈ మూడు తేదీల్లో జ‌న్మించిన వారి ప్రేమ, వైవాహిక జీవితం( Marriage Life ) గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే ఈ సంఖ్య‌ల మూల సంఖ్య 5. ఈ సంఖ్యలో జ‌న్మించిన వారి జీవితమంతా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఒక్క విష‌యంలో మాత్రం స‌మ‌స్య‌లు ఎదురవుతాయ‌ట‌. అదే ల‌వ్( Love ) వీరికి క‌లిసిరాద‌ట‌. ప్రేమ పెళ్లిళ్లు అస‌లే వ‌ర్క‌వుట్ కావ‌ట‌.

14వ తేదీన జ‌న్మించిన వారికి..

14వ తేదీన జ‌న్మించిన వారు చాలా అదృష్ట‌వంతుల‌ట‌. కానీ వీరికి ప్రేమ అస‌లు క‌లిసిరాద‌ట‌. వీరు జీవితాంతం ప్రేమ‌లో ఫెయిల్ అవుతూనే ఉంటార‌ట‌. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంద‌ట‌.

5వ తేదీన జ‌న్మించిన వారికి..

5వ తేదీన జన్మించిన వారికి కెరీర్ పరంగా మంచి వృద్ధి ఉంటుందంట. కానీ వైవాహిక జీవితం, ప్రేమ పెళ్లి వంటివి కలిసి రావంట. వీరు ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటే మోస‌పోవ‌డం ఖాయ‌మ‌ట‌. కాబట్టి 5వ తేదీన జ‌న్మించిన వారు ప్రేమ విష‌యాల‌కు దూరంగా ఉండ‌డం మంచిద‌ట‌.

23వ తేదీన జ‌న్మించిన వారికి..

ఈ తేదీలో జ‌న్మించిన వారి సంసార జీవితం చాలా హ్యపీగా ఉంటుంద‌ట‌. కానీ ప్రేమ‌లో ఫెయిల్ అవుతార‌ట‌. ప్రేమ, ల‌వ్ మ్యారేజ్ విష‌యంలో ఈజీగా మోస‌పోతార‌ట‌. అస‌లు వీరికి ల‌వ్ ప‌నికిరాద‌ట‌.

Exit mobile version