Viral Video | నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్‌లో వైరల్ వీడియో

Viral Video | కర్ణాటకలో ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిన మణిపాల్‌లో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. నలుగురూ చూస్తారన్న భయం కూడా లేకుండా నడిరోడ్డుపైనే ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video | నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్‌లో వైరల్ వీడియో

Viral Video | ఒకప్పుడు ప్రైవసీగా సాగిన ముద్దుముచ్చటలు బహిరంగమైపోయాయి. ప్రేమికులు రెచ్చిపోయి నడిరోడ్డు మీదనే రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు మనం వార్తల్లో, సోషల్‌మీడియాలో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిన కర్ణాటకలోని మణిపాల్‌లో కూడా ఓ ప్రేమజంట బహిరంగంగానే రెచ్చిపోయింది. నలుగురూ చూస్తారన్న భయం లేకుండా లిప్ కిస్‌ల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో బహిరంగ ప్రదేశంలో ముద్దులు పెట్టుకుంటూ.. రొమాన్స్ చేసుకోవడం గమనించిన ఓ వ్యక్తి వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. దీనికి వారు సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా జారుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా పేరొందిన మణిపాల్‌లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట.. ఇలాంటి పనులు చేయడం వల్ల మిగతా వారు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వీడియో తీసిన వ్యక్తిని తప్పుబడుతున్నారు. వాళ్ల రొమాన్స్ మీకు అంగీకారం కాదు సరే.. మరి ఇలా ఇతరులను వీడియో తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

 


కాగా, కర్ణాటకలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మేలో బెంగళూరు ట్రాఫిక్‌లో ఓ యువ జంట కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ముద్దులు పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ జంటను గుర్తించారు. అతనికి రూ.1500 జరిమానా విధించారు. అందులో డేంజరస్ డ్రైవింగ్ కింద రూ.1000, సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన కింద రూ.500 విధించారు.

Read More:

Monkey | ఎర్ర మట్టిని తినడం అలవాటు చేసుకుంటున్న కోతులు.. టూరిస్టులు ఇచ్చే జంక్‌ఫుడ్ వల్లేనా?

గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..