Site icon vidhaatha

BJP MLAs: ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్

విధాత: బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ అరెస్టు విషయం తెలుసుకునేందుకు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్‌ను ఏ కేసులో అరెస్ట్ చేశారో తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చానని నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటు రఘునందన్ రావు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు.

పోలీసులు బలవంతంగా రఘునందన్‌ను కారులోకి ఎక్కించబోతుండగా మహిళా బిజెపి నాయకులు పలువురు అడ్డుకోబోయారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు.

ఉదయం నుంచి శామీర్‌పేట్‌లో హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఈటలను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి వెళ్తున్న రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులకు బిజెపి కార్యకర్తలకు తోపులాట సాగింది. పోలీసులు రఘునందన్ రావును బలవంతంగా కారులోకి ఎక్కించినప్పటికీ అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లకుండా కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది

Exit mobile version