Vice President Election | న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా తర్వాత నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ శుక్రవారం రిటర్నింగ్ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఇందుకు సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేసింది.
రాజ్యసభ చైర్మన్ అంగీకారంతో ఉప రాష్ట్రపతి 2025ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ కార్యదర్శి జనరల్ గరీమా జైన్ ను ఈసీఐ నియమించింది. అదనంగా రాజ్యసభ కార్యాలయం డైరెక్టర్ విజయ్ కుమార్ ను సహాయక రిటర్నింగ్ అధికారిగా నియమించింది. నెల రోజులోపే ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కానుంది.