Vivo | వివో నుంచి X300 Ultra, X300 FE లాంచ్.. ధర ఎంతంటే..!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి Vivo X300 సిరీస్‌లో మొబైల్స్ భారత మార్కెట్‌లో విడుదలయ్యాయి. X300FE, X300 Ultra మోడళ్లు Zeiss కెమెరా సిస్టమ్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో వస్తున్నాయి.

Vivo | చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త ప్రీమియం మొబైల్ Vivo X300 FE మోడల్‌ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది. అలాగే తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన Vivo X300 Ultraను కూడా ఆవిష్కరించింది. Zeiss కెమెరా సిస్టమ్, పవర్‌ఫుల్ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధర ఎంతంటే..

Vivo X300 FE మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.79,999గా నిర్ణయించారు. ఇక 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ ధరను రూ.89,999గా ఖరారు చేశారు. అలాగే Vivo Zeiss టెలిఫొటో ఎక్స్‌టెండర్ జెన్ 2 లెన్స్ ధర రూ.15,999, టెలిఫొటో ఎక్స్‌టెండర్ యాక్సెసరీ కిట్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ Lilac Purple, Noir Black, Urban Olive కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇక Vivo  X 300 Ultra కేవలం ఒకే వేరియంట్‌గా వస్తుంది. 16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,59,999గా నిర్ణయించారు. వివో Zeiss టెలిఫొటో ఎక్స్‌టెండర్ జెన్ 2 అల్ట్రా(400mm Equivalent) ధర రూ.27,999.. వివో ఇమేజింగ్ గ్రిప్ కిట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ Eclipse Black, Victory Green కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆఫర్లు

ఈ మొబైల్ మే 14వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అధికారిక వెబ్‌సైట్ వివో‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ కొనుగోలుపై SBI, IDFC First Bank, Axis Bank కార్డులతో చెల్లింపు వినియోగదారులకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు వివో కంపెనీ తెలిపింది.

Vivo X300 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Vivo X300 FE మొబైల్ 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 1260*2640 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. SGS Low Blue Light సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్‌కు IP 68, IP 69 రేటింగ్‌తో వస్తుండటంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 94.38 శాతంగా ఉండటం వల్ల బెజెల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి.

ఈ ఫోన్‌లో Qualcomm తయారుచేసిన 3nm ఆధారిత Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో ఆరు ఎఫిషియెన్సీ కోర్‌లు, రెండు హైపర్ఫార్మెన్స్ కోర్లు ఉండగా.. గరిష్టంగా క్లాక్ స్పీడ్ 3.8GHz వరకు ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 829 GPU అందించారు. వేడి నియంత్రణకు 4005 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం కలిగిన వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ వ్యవస్థను అమర్చారు.

ఫొటోగ్రఫీ కోసం Vivo X300 FE ఫోన్‌లో Zeiss ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అమర్చారు. ఇందులో ప్రధానంగా 50మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్‌తో కూడిన కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. దీంతో పాటు 50మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, సోనీ IMX882 సెన్సార్‌‌ను అందించారు. ఇది 100x డిజిటల్ జూమ్‌ సపోర్టు చేస్తుంది. మరో 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 4K 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

Vivo X300 FE మొబైల్‌లో 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డ్‌ ఫ్లాష్ చార్జ్, 40W వైర్‌లెస్ చార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, Wifi, Bluetooth 6.0, NFC, USB Type C, NavIC సహా అనేక ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS6పై పనిచేస్తుంది. ఈ మొబైల్‌కు ఐదేళ్ల పాటు OS అప్‌డేట్లు, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని వివో కంపెనీ ప్రకటించింది.

Vivo X300 Ultra ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్ 6.82 అంగుళాల 2K(1440*3168పిక్సెల్) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రీఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 94.49 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, HDR మద్దతును అందిస్తుంది.

ఈ ఫోన్‌ Qualcomm ఫ్లాగ్‌షిప్ Snapdragon 8 Gen 5 Soc ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది Adreno 840 GPU, వివో VS1+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 16GB వరకు LPDDR5x ర్యామ్ 1 టీబీ వరకు UFS4.1 స్టోరేజ్‌ను అందిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 6600 mAh బ్యాటరీని అందించారు. ఇది 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆధారిత OriginOS6పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో Zeiss ట్యూన్డ్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS కలిగిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 3.7x ఆప్టికల్ జూమ్, గరిష్ఠంగా 105x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 200మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో సెన్సార్, 50మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇవి 8K వరకు వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేయడం గమనార్హం. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Read More:

మోటరోలా నుంచి భారత్‌లోకి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఈ నెలలోనే లాంచ్‌కు సిద్ధం!

హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు

 

Latest News