Realme 16T | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అధికారిక ప్రకటనకు ముందే తన తదుపరి ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. గీక్‌బెంచ్‌లో RMX5268 మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ ఫోన్‌ను Realme 16T గా టెక్ నిపుణులు భావిస్తున్నారు. గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్‌తో పాటు ముఖ్యమైన స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. అయితే ఈసారి ఆశ్చర్యకరంగా గత Realme 15Tతో పోలిస్తే కొత్త మోడల్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లిస్టింగ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై పనిచేస్తుంది. మాలి-G57 MC2 CPUతో రానుంది. ఇందులో 8జీబీ ర్యామ్ ఉండనుంది. గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో భారత మార్కెట్‌లో లభించే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గీక్‌బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్ కోర్‌లో 784 పాయింట్లు, మల్టీ కోర్‌లో 2007 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్‌ను బట్టి ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్‌కు సరిపోయేలా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో గత మోడల్ కంటే పెద్దగా మెరుగుదల కనిపించలేదు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో రెండు హై పర్ఫార్మెన్స్ కోర్‌లు 2.40GHz వద్ద, ఆరు ఎఫిషియెన్సీ కోర్2లు 2.00GHz వరకు పనిచేస్తాయి. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 6400 Max చిప్‌సెట్‌తో వచ్చిన రియల్‌మీ 15టీతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. దీన్నిబట్టి 16టీ మోడల్‌ను తక్కువ ధరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.
డిజైన్ పరంగా చూస్తే.. Realme 16T ఫోన్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో రానుందని సమాచారం. Arora Green, Starlight Blac, Starlight Red రంగుల్లో ఇది వస్తుంది.
Realme 15T విషయానికి వస్తే ఇది గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.20,999 ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1080*2372 పిక్సెల్ రిజల్యూషన్, 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 7000mAh భారీ బ్యాటరీ, 60W ఫాస్ట్ చార్జింగ్, 10W రివర్స్ చార్జింగ్ సపోర్టుతో వచ్చింది. అదనంగా IP66, IP68, IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకత కలిగి ఉంది.
కానీ Realme 16T మోడల్ పనితీరుపరంగా గత మోడల్‌తో పెద్ద అప్‌గ్రేడ్ కాకపోయినా.. ధర, డిజైన్, ఇతర ఫీచర్లలో రియల్‌మీ ఏదైనా ప్రత్యేకత చూపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read More:
షావోమీ సివి సిరీస్ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్‌కు వస్తాయా?
200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!
