Moto G87 | 200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!
Moto G87 | మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G87ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన Moto G67, Moto G77 మోడళ్లకు కొనసాగింపుగా ఈ మొబైల్ రాబోతున్నట్లు సమాచారం.
Moto G87 | మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G87ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన Moto G67, Moto G77 మోడళ్లకు కొనసాగింపుగా ఈ మొబైల్ రాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. తాజాగా లీకైన రెండర్స్, స్పెసిఫికేషన్లు ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రఖ్యాత టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్(@evleaks) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. Moto G87లో సెంటర్ పంచ్ హోల్ డిస్‌ప్లే ఉండనుంది. స్క్రీన్ చుట్టూ సన్నటి బెజెల్స్‌తో ఆకర్షణీయమైన లుక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కెమెరా స్పెసిఫికేషన్లు
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో Moto G87 మొబైల్ వస్తోంది. ఈ కెమెరా మాడ్యుల్ Moto G67, Moto G77 మోడళ్లను పోలి ఉంది. కానీ కెమెరా సామర్థ్యం మాత్రం వాటితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇందులో 200మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండొచ్చని సమాచారం. ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న Moto G67లోని 50మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, Moto G77లోని 108మెగాపిక్సెల్ కెమెరాతో పోలిస్తే ఇది భారీ అప్‌గ్రేడ్ అవుతుంది. ఫొటోగ్రఫీ ప్రియులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని సమాచారం.
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ 9.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. పెద్ద స్క్రీన్, మెరుగైన కలర్ అవుట్‌పుట్, మంచి బ్రైట్‌నెస్‌తో వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా వినియోగానికి ఇది మరింత అనుకూలంగా ఉండనుంది.. ఇక ఇది IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండొచ్చని సమాచారం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6100+, డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6400 సిరీస్ చిప్‌సెట్‌ల్లో ఏదో ఒకటి ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బ్యాటరీ వివరాలు
బ్యాటరీపరంగా చూస్తే.. 5200mAh సామర్థ్యంతో వస్తుంది. ఇందులో 30W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌తో పాటు వేగంగా చార్జింగ్ కూడా అందుబాటులో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుంది.
కలర్ ఆప్షన్స్
Moto G87 స్మార్ట్‌ఫోన్ Pantone Blue Atoll, Pantone Overture Gray పేర్లతో బ్లూ, బ్లాక్ రంగుల్లో రానుందని సమాచారం. అదనంగా Arctic Seal, Black Olive, Nile, Shaded Spruce వంటి మరిన్ని Pantone కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది.
ధర ఎంత ఉండొచ్చంటే..
ధర విషయానికి వస్తే.. ఇటీవల ఒక రిటైల్ వెబ్‌సైట్‌లో 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ 407 యూరోలు (సుమారు రూ.44,800) ధరతో కనిపించింది. దీంతో ఇది మధ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ఫోన్ పోటీని పెంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Read More:
10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!
గేమింగ్ లవర్స్‌కు ఇన్‌ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram