Motorola Razr Fold | భారత్‌లోకి మరో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా తన తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘రేజర్ ఫోల్డ్’ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్‌ను ఈ నెలలోనే తీసుకొస్తున్నట్లుగా సంకేతాలిచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రో సైట్ భారత్‌లో ప్రారంభమవ్వడంతో ఈ మొబైల్ లాంచ్‌పై ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి.
ఈ ఏడాది మార్చిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026లో మోటరోలా తొలిసారిగా తన ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అనంతరం ఏప్రిల్ 29న అమెరికాలో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పుడు అదే మోడల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. మోటరోలా రేజర్ ఫోల్డ్ అత్యాధునిక స్పెసిఫికేషన్లతో ఆకట్టుకుంటుంది. ఇందులో 3 నానోమీటర్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేసే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంది. ఇది 3.8GHz పీక్ క్లాక్ స్పీడ్‌తో అధిక పనితీరును అందిస్తుంది. అదనంగా అడ్రెనో A829GPU, క్వాల్కమ్ AI ఇంజిన్‌తో కూడిన హెక్సాగాన్ NPU కూడా ఉందులో ఉన్నాయి. ఈ రేజర్ ఫోల్డ్‌లో గరిష్టంగా 16జీబీ LPDDR5x ర్యామ్, 512 జీబీ వరకు UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.
డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 8.1 అంగుళాల 2K LTPO pOLED మెయిన్ స్క్రీన్ కలదు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను మడిచినప్పుడు బయటి భాగంలో 6.6 అంగుళాల LTPO pOLED కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 165Hz రీఫ్రెష్ రేటుతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 రక్షణను అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు
కెమెరాపరంగా కూడా ఈ ఫోన్ శక్తివంతంగా ఉంది. ఈ మొబైల్ వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ చొప్పున మూడు కెమెరాలు ఉండగా.. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌లో ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఈ సెటప్ రూపొందించబడింది.
బ్యాటరీ కెపాసిటీ
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 6000mAh సామర్థ్యం కలిగిన సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. దీని ద్వారా తక్కువ సమయంలో ఫుల్ చార్జింగ్ అవుతుంది.
అదనంగా ఈ ఫోన్ IP49 రేటింగ్‌తో వస్తుంది. అంటే ధూళి, నీటి నుంచి కొంతమేరకు రక్షణ లభిస్తుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Read More:
హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు
త్వరలోనే రియల్‌మీ నుంచి కొత్త మొబైల్.. గత మోడల్‌తో పోలిస్తే పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్!
