Xiaomi Civi 6 | షావోమీ సివి సిరీస్‌ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్‌కు వస్తాయా?

Xiaomi Civi 6 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తన Civi సిరీస్‌లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే Xiamoi Civi 6, Xiamoi Civi 6 Pro ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.

Xiaomi Civi 6 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తన Civi సిరీస్‌లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే Xiamoi Civi 6, Xiamoi Civi 6 Pro ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు తాజాగా బయటకు రావడంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. Xiamoi Civi 6, Xiamoi Civi 6 Pro మొబైల్ ఫోన్లు త్వరలోనే చైనా మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీకుల ప్రకారం.. Xiamoi Civi 6 మొబైల్ 6.59 అంగుళాల 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 5x ఆప్టికల్ జూమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.

Xiamoi Civi 6 Pro విషయానికి వస్తే ఇది మరింత ప్రీమియం ఫీచర్లతో రానుంది. 6.83 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. కెమెరాపరంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌తో 5x జూప్ సపోర్టు ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా 3వేల చైనా యువాన్లపైనే ఉండొచ్చని అంచనా. అంటే మన కరెన్సీలో రూ.41వేలపైనే అన్నమాట!

Xiaomi Civi 5 Pro సక్సెసర్!

గత ఏడాది విడుదలైన Xiaomi Civi 5 Pro మోడల్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ మొబైల్స్ వస్తున్నాయి. Civi 5 Pro మోడల్‌లో 6.55 అంగుళాల 1.5K డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8S Gen4 ప్రాసెసర్, లైకా మద్దతుతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు అందించారు. అలాగే 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు వంటి స్పెసిఫికేషన్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అప్‌గ్రేడెడ్‌గానే civi 6 మోడల్స్ వస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లోకి వస్తుందో? లేదో!

షావోమీ కంపెనీ Civi సిరీస్ ఇప్పటివరకు చైనా మార్కెట్‌కే పరిమితమైంది. కాబట్టి Xiaomi Civi 6 సిరీస్ కూడా చైనాలోనే విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌ ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌లోకి వస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Read More:

200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!

10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!

Latest News