ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..!

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. మెట్రో ఫేజ్-2 అనుమతులు, రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

హైదరాబాద్ మెట్రో.. ప్రభుత్వ పరమైనట్లుగా కేంద్ర మంత్రికి నివేదించారు. ప్రతిపాదిత రెండో దశకు అనుమతులు ఇవ్వడంతో పాటు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-3 కింద చేపట్టాలని కోరారు.

రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించి సంబంధిత శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు కొనుగోళ్ల అక్రమాల కేసులపై విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్‌ను కలిసి రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని తెలుస్తుంది.

అలాగే తాజాగా వెలువడిన కేరళం, తమిళనాడు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంతో భవిష్యత్తు పార్టీ కార్యచరణపై చర్చించనున్నారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తమిళనాడుతో టీవీకేకు కాంగ్రెస్ మద్దతు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ అగ్రనేతలతో రేవంత్ చర్చించనున్నారు.

తెలంగాణలో ఎప్పటి నుంచో ఇదిగో అదిగో అంటూ వస్తున్న కేబినెట్ విస్తరణ లేక పునర్ వ్యవస్థీకరణపై ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఫిలిప్పీన్స్‌లో వింత వాహనం ‘హబల్-హబల్’!
Jana Nayagan | ‘సీఎం దళపతి విజయ్’గా టైటిల్ కార్డ్‌లో చూడాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. ‘జన నాయగన్’పై భారీ అంచనాలు

Latest News