Aus vs Afg| వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్.. సూప‌ర్ 8లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్

Aus vs Afg| చిన్న జ‌ట్లే క‌దా అని త‌క్కువ అంచ‌నా వేస్తే ఒక్కోసారి మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా సెయింట్ విన్సెంట్ వేదికగా అఫ్గానిస్థాన్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య

  • Publish Date - June 23, 2024 / 09:47 AM IST

Aus vs Afg| చిన్న జ‌ట్లే క‌దా అని త‌క్కువ అంచ‌నా వేస్తే ఒక్కోసారి మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా సెయింట్ విన్సెంట్ వేదికగా అఫ్గానిస్థాన్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా కూడా సూప‌ర్భ్ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చిన జ‌ట్టు ఆసీస్‌పై 20 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి సెమీస్ అవ‌కాశాలు మెరుగుప‌ర‌చుకుంది. ముందుగా ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌గా, నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో అద‌ర‌గొట్టారు.

తొలి వికెట్‌కి వీరిద్ద‌రు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. అయితే అఫ్గాన్ ఓపెనర్లు వికెట్ ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా ఆడుతూ వ‌చ్చారు. అయితే ఓపెనర్స్ ఇద్ద‌రు ఔట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ బ్యాట్ ఝుళిపించే క్ర‌మంలో వికెట్ల‌ని వెంట‌వెంట‌నే చేజార్చుకున్నారు. సులువుగా 170-180 పరుగులు సాధించేలా కనిపించిన అఫ్గాన్ 148 పరుగులతో సరిపెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోను క‌మ్మిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. 18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ (2; 4 బంతుల్లో)ను ఔట్ చేసిన కమిన్స్ ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు తీసి మరోసారి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనే బంగ్లాదేశ్‌పై క‌మ్మిన్స్ హ్యాట్రిక్ సాధించ‌డం మ‌నం చూశాం.

ఇక 149 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాని న‌వీన్, గుల్బ‌ద్దీన్ ముప్పుతిప్ప‌లు పెట్టారు. న‌వీన్ నాలుగు ఓవ‌ర్స్ వేసి 20 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇక గుల్బ‌ద్దీన్ కూడా నాలుగు ఓవర్స్‌కి 20 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్స్ తీసాడు. అజ్మ‌తుల్లా, న‌బీ, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ తీసారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌లో మ్యాక్స్ వెల్‌( 41 బంతుల్లో 59 ఒక్క‌డే అద్భుతంగా ఆడాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో అత‌ని వికెట్ కోల్పోవ‌డంతో ఆస్ట్రేలియా ఓట‌మి దాదాపు ఖాయ‌మైపోయింది. హెడ్ (0), వార్నర్(3), మార్ష్‌( 12), స్టోయినిస్ (11), వేడ్‌(2), క‌మ్మిన్స్ (3) ,అగ‌ర్(2), జంపా (9) , హాజిల్ వుడ్( 5 నాటౌట్‌) ప‌రుగులు చేశారు.ఆస్ట్రేలియా జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్ 21 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ఆఫ్ఘ‌నిస్తాన్ ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

Latest News