Anand Mahindra – MS Dhoni|అత‌డి ఆట‌ని చూశాక నా పేరు ఇలా మారిపోయింది.. ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర ట్వీట్

Anand Mahindra – MS Dhoni|ఆట‌గాళ్ల‌కి వ‌య‌స్సు పెరుగుతున్న‌ప్పుడు ఆటోమేటిక్‌గా ఫామ్‌ని కోల్పోతుండ‌డం స‌హ‌జం. కాని అందుకు భిన్నంగా దూసుకుపోతున్నాడు మ‌హేంద్ర సింగ్ ధోని. రోజు రోజుకి ఆయ‌న కుర్రాడిలా మారుతున్నాడు. వికెట్ల వెన‌క వేగంగా క‌దులుతూ అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ధోని బ్యాట్‌తోను మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నా

  • Publish Date - April 15, 2024 / 10:33 AM IST

Anand Mahindra – MS Dhoni|ఆట‌గాళ్ల‌కి వ‌య‌స్సు పెరుగుతున్న‌ప్పుడు ఆటోమేటిక్‌గా ఫామ్‌ని కోల్పోతుండ‌డం స‌హ‌జం. కాని అందుకు భిన్నంగా దూసుకుపోతున్నాడు మ‌హేంద్ర సింగ్ ధోని. రోజు రోజుకి ఆయ‌న కుర్రాడిలా మారుతున్నాడు. వికెట్ల వెన‌క వేగంగా క‌దులుతూ అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ధోని బ్యాట్‌తోను మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్ర‌మంలోనే చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. అయితే ధోని చేసిన 20 ప‌రుగుల వ‌ల్ల‌నే సీఎస్కే విజ‌యం సాధించింది. ముంబైపై 20 ప‌రుగుల తేడాతో సీఎస్కే గెలిచిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై త‌ర‌పున ఆడిన రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) అద్భుతంగా ఆడిన కూడా ధోనిపైనే ఎక్కువ‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. అందుకు కార‌ణం ఆయ‌న చివ‌రి ఓవ‌ర్‌లో క‌నిపించిన ప‌ర్‌ఫార్మెన్స్. అస‌లు ధోని ఆట తీరు చూశాక అంద‌రు కూడా వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని.. ఆటకు వయసు అనేది అడ్డంకి కాదని అంటున్నారు. రిటైర్మెంట్ వ‌య‌స్సులో కూడా ధోని ఇలా పెను తుఫాను సృష్టించడం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో ధోని గురించే చర్చ జరుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ గురించి ప్ర‌స్తావిస్తూ… ” అంతటి ఒత్తిడి, ఎన్నో ప్రచారాలు, రకరకాల కారణాల మధ్య ఒక ఆటగాడు ఇంతలా ఎదిగిన తీరు అద్భ‌తం. అగ్నికి ఆజ్యం తోడైన‌ట్టు అత‌ను బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం. ఇది చూశాక నేను గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఇప్పుడు నా పేరు “మహీ” ఇంద్ర” అని ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. అంతేకాకుండా హేంద్ర సింగ్ ధోని చేసిన బ్యాటింగ్ కు సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న ట్వీట్‌లో యాడ్ చేయ‌డం విశేషం. ప్రస్తుతం ఆనంద్ మ‌హేంద్ర చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార‌గా, దీనిపై కూడా ప‌లువురు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ధోని వ‌చ్చే ఏడాది నుండి ఐపీఎల్‌కి దూరంగా ఉంటార‌ని అంటున్నారు.

Latest News