Site icon vidhaatha

IND vs NZ| భార‌త్ 462 ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంత అంటే..!

IND vs NZ| చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ 462 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగులకే ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరే చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకి ఔట్ అయిన సర్ఫ‌రాజ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి కేవలం 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌లో సున్నాతో సెంచరీ చేసిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు.రిష‌బ్ పంత్‌, స‌ర్ఫ‌రాజ్ ఇద్ద‌రు క‌లిసి వికెట్ ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా ఆడారు. కాని 150 ప‌రుగుల ద‌గ్గ‌ర షాట్‌కి య‌త్నించి స‌ర్ఫ‌రాజ్ ఔట‌య్యాడు. ఇక కొద్ది సేప‌టికి రిషభ్ పంత్ దురదృష్టకర రీతిలో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు.

కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేశాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విలియమ్ ఓ రూర్కీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని పంత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి లెగ్ స్టంప్‌ను లేపేయ‌డంతో చాలా నిరాశ‌గా మైదానాన్ని వీడాడు.అత‌ను గ్రౌండ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో ఆకాశం వైపు చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు. సెంచరీ చేజారినా కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్‌కు టీమిండియా ఆటగాళ్లంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రశంసించారు. ఇక సర్ఫ‌రాజ్ ఔట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేదు.

పంత్ ఔటైన వెంటనే కేఎల్ రాహుల్ కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా(5) , అశ్విన్ (15), కుల్దీప్ (6), బుమ్రా(0), సిరాజ్ (0) వికెట్లు వెంట‌వెంట‌నే ప‌డిపోవ‌డంతో భార‌త్ 462 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. దీంతో భార‌త్‌కి 106 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఇప్పుడు న్యూజిలాండ్ గెల‌వాలి అంటే 107 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మ‌రో 20 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గా, రేపు 90 ఓవ‌ర్ల ఆట ఉంది. దీంతో
కివీస్ గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ బౌల‌ర్స్ లో హెన్నీ, విలియ‌మ్ చెరో మూడు వికెట్స్ తీసుకున్నారు. అజాజ్ రెండు, ఫిలిప్స్, సౌథీ చెరో వికట్ తీసుకున్నారు.

Exit mobile version