IND vs PAK| మ‌రికొద్ది గంట‌ల‌లో పాక్-భార‌త్ హైఓల్టేజ్ మ్యాచ్‌.. టీమ్‌లో ఎవ‌రెవ‌రు ఆడ‌నున్నారంటే..!

IND vs PAK| టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందిస్తుంది. అయితే క్రికెట్ ప్రేమికులు గ‌త కొన్నాళ్లుగా భార‌త్‌- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుండ‌గా, నేడు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Publish Date - June 9, 2024 / 12:00 PM IST

IND vs PAK| టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందిస్తుంది. అయితే క్రికెట్ ప్రేమికులు గ‌త కొన్నాళ్లుగా భార‌త్‌- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుండ‌గా, నేడు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయస విజయం అందుకున్న టీమిండియా ఉత్సాహంగా కనిపిస్తుండగా.. పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది.

భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటివరకు ఉపయోగించని పిచ్‌ను కేటాయించామని ఐసీసీ చెబుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య బౌన్స్‌ కారణంగా ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం మనం చూశాం. రోహిత్‌ శర్మ భుజానికి స్వల్ప గాయమై రిటైర్డ్‌ హర్ట్‌గా వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదకరమైన పిచ్‌పై టీ20 మ్యాచ్‌ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించినట్లు సమాచారం. న్యూయార్క్ ఫ్యాన్స్ కోసం తక్కువ సమయంలోనే 34 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన స్టేడియాన్ని నిర్మించింది. అయితే ఈ మైదానం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కంటే పిచ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా ఈసారి కూడా నలుగురు ఆల్ రౌండర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇదే మైదానంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లు.. ఈ కంపోజిషన్‌తో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఏర్పాటు చేస్తుంది.టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నందున, ఏడుగురు బౌలర్లను కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను టీమిండియాలో అదనపు పేసర్లుగా ఉపయోగించుకోవచ్చు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. తద్వారా ఏడుగురు బౌలర్లతో టీమ్ ఇండియా వ్యూహం రచించే అవకాశం ఉంది. ఇక ఓపెనింగ్ కోహ్లీ, రోహిత్ చేయ‌నున్నార‌ని అంటున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

Latest News