Site icon vidhaatha

INDIA| న్యూజిలాండ్‌పై ఓట‌మితో డబ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్ దారులు మూసుకుపోయాయా..!

INDIA|  బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా అదే ఉత్సాహంతో న్యూజిలాండ్‌పై కూడా గెలుస్తుంద‌ని అంద‌రు భావించారు. కాని తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‍పై ఘ‌న విజ‌యం సాధించింది. 36ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఓ టెస్టు విజయం చ‌వి చూసింది టీమిండియా. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. అయితే 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కి చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం అందించారు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన టీమిండియా 462 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ ఓ మోస్త‌రు స్కోరు చేసిన భార‌త్ కాస్త ఫైట్ చేయ‌గ‌లిగేది. అప్ప‌టికీ రెండో ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మెన్స్ బాగానే పోరాడారు. స‌ర్ఫ‌రాజ్ ,పంత్ గ‌ట్టి పోరాట‌మే చేశారు. అయితే కొత్త బంతి అందుకున్న న్యూజిలాండ్ వ‌రుస వికెట్స్ తీసి భార‌త్‌పై ఒత్తిడి తెచ్చింది.పాత బంతితో 400కి ప‌రుగులు చేసిన టీమిండియా కొత్త బంతి వ‌చ్చాక మ‌రో 50,60 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ప్ర‌స్తుత గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది.

అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుండ‌గా, ఈ మ్యాచ్‌లో గెలిచి రివేంజ్ తీర్చుకోవాల‌నే క‌సితో ఉంది భార‌త్.. అయితే ఈ ఓటమి‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా విన్నింగ్ పర్సంటేజీని తగ్గించింది. ప్రస్తుతం అగ్రస్థానంలోనే కొనసాగుతున్నా.. ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే తదుపరి 7 టెస్ట్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న ఏడు టెస్టుల్లో టీమిండియా కనీసం నాలుగు మ్యాచ్‍ల్లో గెలిచి.. రెండు డ్రా చేసుకోవాలి. ఇలా చేస్తే 67.54 శాతంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్ అడుగుపెడుతుంది. ఐదు మ్యాచ్‍ల్లో గెలిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, ఈ ఏడు టెస్టుల్లో రెండు కంటే ఎక్కువ మ్యాచ్‍లను భారత్ ఓడిపోతే ఫైనల్ చేరడం కాస్త క‌ష్ట‌మే. ఒకవేళ మూడు మాత్రమే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఫైనల్ బెర్త్ ఆధారపడుతుంది.

Exit mobile version