Site icon vidhaatha

IPL 2024| శ‌నివారం ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్… ఏఏ జ‌ట్లు విజ‌యం సాధించాయంటే..!

IPL 2024| శ‌నివారం రోజు రెండు క్రేజీ మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో ముందుగా ఢిల్లీ, ముంబై మ‌ధ్య ఆసక్తిక‌ర ఫైట్ జ‌రిగింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేసి మ‌రో అప‌జయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ చేయ‌గా, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (84; 27 బంతుల్లో, 11×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6×4, 2×6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5×6) భారీగా ప‌రుగులు రాబ‌ట్టారు. దీంతో ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌ల‌లో 258 ప‌రుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఫ్రేజర్ 15 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ చేశాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు అత‌నిపైనే ఉండ‌గా, రెండోసారి దానిని సాధించాడు.

ల‌క్ష్య చేధ‌న‌లో తెలుగబ్బాయి తిలక్‌ వర్మ (32 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చాలా పోరాడిన కూడా ఫ‌లితం లేకుడా పోయింది. ఇక ముంబై బ్యాట్స్‌మెన్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (20), రోహిత్‌ శర్మ (8) , ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 26, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిరాశ‌పరిచారు. ఇక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ( 24 బంతుల్లో 46, 4 ఫోర్లు; 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించిన కూడా ముంబై ఇండియన్స్ కు పరాజయం తప్పలేదు. ఈ సీజన్ లో ముంబైకు ఇది ఆరో ఓట‌మి కావ‌డంతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మ‌రో మ్యాచ్‌లో ఆర్ఆర్, ల‌క్నో త‌ల‌ప‌డ్డాయి. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సంజు శాంసన్ (71*; 33 బంతుల్లో, 7×4, 4×6) , ధ్రువ్ జురెల్ (52*; 34 బంతుల్లో, 5×4, 2×6) విధ్వంసం సృష్టించ‌డంతో ఆ జ‌ట్టు మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకొని ప్లేఆఫ్ ఆశ‌ల‌ని మ‌రింత మెరుగు ప‌రచుకుంది. ముందుగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76; 48 బంతుల్లో, 8×4, 2×6), దీపక్ హుడా (50; 31 బంతుల్లో, 7×4) అర్ధశతకాలతో రాణించ‌డంతో మంచి స్కోరే చేశారు. ల‌క్ష్య చేధ‌న‌లో బట్లర్ (24; 18 బంతుల్లో, 3×4, 1×6), యశస్వీ జైస్వాల్ (34; 18 బంతుల్లో) దూకుడుగా ఆడ‌డంతో ప‌రుగుల ప్ర‌వాహం సాగింది.ఆరో ఓవ‌ర్‌లో బ‌ట్ల‌ర్ ఔట్ కాగా, పవర్‌ప్లే ముగిసిన వెంటనే జైస్వాల్ ఔట‌య్యాడు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు 60/0తో ఉన్న ఆర్‌ఆర్ 60/2గా మారింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన రియాన్ పరాగ్ (14; 11 బంతుల్లో, 1×6) కూడా త్వ‌ర‌గానే పెవీలియ‌న్ చేరాడు. ఈ క్ర‌మంలో మూడు వికెట్ల న‌ష్టానికి 78 ప‌రుగులు చేసింది ఆర్ఆర్. ఆ స‌మ‌యంలో శాంస‌న్, జురెల్ ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్ద‌డ‌మే కాకుండా త‌మ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించారు.

Exit mobile version