Site icon vidhaatha

LSG vs CSK|ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసిన ధోని… ర‌ఫ్ఫాడించిన రాహుల్‌.. విజేత ఎవ‌రంటే..!

LSG vs CSK|ఐపీఎల్ 2024లో భాగంగా శుక్ర‌వారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌రిగింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ గెలుస్తుంద‌ని అంద‌రు ఊహించిన దానికి రివ‌ర్స్ ఫ‌లితం వ‌చ్చింది. సొంత మైదానంలో ఆల్‌రౌండ్‌ షోతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాటింగ్ చేయ‌గా, తొలి బంతికే ర‌చిన్ ర‌వీంద్ర డౌకౌట్‌గా పెవీలియ‌న్ చేరాడు. దీంతో చెన్నై క‌ష్టాల‌లో ప‌డ్డ‌ట్టు క‌నిపించింది. ఆ స‌మ‌యంలో రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5×4, 1×6) అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఆక‌ట్ట‌కుకున్నాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5×4, 1×6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3×6) కాస్త ఆక‌ట్టుకునే బ్యాటింగ్ చేయ‌గా, చివ‌రిలో ధోని ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు.

ధోనీ (28; 9 బంతుల్లో, 3×4, 2×6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడ‌డంతో చెన్నై జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌కి గాను ఆరు వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9×4, 3×6), క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5×4, 1×6) అర్ధశతకాలతో కదం తొక్క‌డంతో లక్నోకి విజ‌యం సునాయాసంగా ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో డికాక్ సంయమనంతో ఆడితే కేఎల్ రాహుల్ దూకుడు బ్యాటింగ్ చేశౄడు. రాహుల్ ముచ్చటైన బౌండరీలతో, స్టైలిస్ట్ సిక్సర్లతో స్కోరు బోర్డ్‌ని ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి ల‌క్నో 54 పరుగులు చేసింది. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత కూడా వీరు స్పీడ్‌గానే ఆడారు. దీంతో 31 బంతుల్లో రాహుల్, 41 బంతుల్లో డికాక్ అర్ధశతకాలు సాధించారు.

అయితే డికాక్ అర్ధ సెంచ‌రీ త‌ర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే రాహుల్‌, డికాక్‌ తొలి వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెల‌కొల్పి ఐపీఎల్-2024లో రికార్డ్ సృష్టించారు.ఈ సీజ‌న్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అయితే విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన స‌మ‌యంలో రాహుల్ మ‌రింత స్పీడ్ పెంచాడు. ఈ క్ర‌మంలోనే జ‌డేజా అద్భుతమైన క్యాచ్‌కి వెనుదిరిగాడు. ఇక నికోలస్ పూరన్ (23*; 12 బంతుల్లో, 3×4, 1×6) , స్టొయినిస్‌ (8*; 7 బంతుల్లో) ఇద్ద‌రు క‌లిసి లక్నోని విజ‌య‌తీరాల‌కి చేర్చారు. మొత్తానికి ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది

Exit mobile version