Site icon vidhaatha

IPL Auction | త్వరలో ఐపీఎల్‌ మెగా వేలం.. ఎంఎస్‌ ధోనీ, విరాట్‌, రోహిత్‌ని మించి ఆ స్టార్‌ బౌలర్‌కే ఎక్కువ ధర..!

IPL Auction | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వేలం నవంబర్‌ చివరివారంలో జరుగనున్నది. ప్రపంచంవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లకు పెద్ద పరీక్షగా మారనున్నది. అయితే, చాలా ఫ్రాంచైజీల జట్లు అగ్రశ్రేణి జట్లు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా భారత స్టార్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో వేలంలోకి రాలేదు. భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ వేలంలోకి రాలేదు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి కాగా.. ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఆటగాడిగా మిగిలాడు. 2008లో తొలిసారిగా జరిగిన వేలంలో మాత్రమే మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని వేలంలోకి వచ్చాడు. దాంతో అత్యధిక పారితోషకం పొందిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా 2011, 2014, 2015లో వేలంలోకి వచ్చారు. ఏది ఏమైనా 2025 ఆక్షన్‌ భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే రిటైన్‌ నియమాల్లో ఐపీఎల్‌ మార్పులు చేసింది.

అదే సమయంలో కేవలం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ జట్లకు స్వేచ్ఛను ఇచ్చింది. అందులో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ ఉండాల్సిందే. జట్లు మొదటి ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్‌లకు రూ.18కోట్లు, రూ.14కోట్లు, రూ.11కోట్లు ఇవ్వనున్నాయి. చివరి ఇద్దరి ప్లేయర్లకు రూ.18కోట్లు, రూ.14కోట్లు వెచ్చించవచ్చు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకోవడానికి జట్లు కేవలం రూ.4కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆయా జట్లు కోరుకుటే రూ.75కోట్లు ఐదుగురు ఆటగాళ్లకు ఖర్చు చేయవచ్చు. ఇక మెగా వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అక్టోబర్‌ 31 వరకు ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. పలువురు ఆటగాళ్లు వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతుందో అంచనాలున్నాయి. ఆయా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించే ఛాన్స్‌ ఉంది.. ఇంతకీ ఆ జాబితాలో ఎవరు ఎవరున్నారో చూసేద్దాం రండి..!

రూ.30కోట్లకో జస్ప్రీత్ బుమ్రా

ముంబయి ఇండియన్స్‌ స్పీడ్‌స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌ వేలంలోకి వస్తే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నది. గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనదైన బౌలింగ్‌తో క్షణాల్లోనే మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా బుమ్రాకు ఉన్నది. ఈ క్రమంలో గతేడాది మిచెల్‌ స్టార్క్‌ కోసం రూ.24.75కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకున్నది. బుమ్రాను ముంబయి ఇండియన్స్‌ వదిలేస్తే ఐపీఎల్‌లో రూ.30కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నది.

విరాట్‌ కోహ్లీకి ఎంతంటే..?

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీకి విరాట్‌ కోహ్లీ గుడ్‌బై చెప్పాడు. అయితే, క్రికెట్‌లో అతిపెద్ద బ్రాండ్‌గా మిగిలాడు. గత సీజన్‌లో విరాట్‌ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. 150 కంటే ఎక్కువ స్ట్రయిక్‌ రేట్‌తో 741 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోని ఏ జట్టయినా విరాట్‌ కోహ్లీని తీసుకునేందుకు పోటీపడే అవకాశం ఉంది. విరాట్‌ కోసం దాదాపు రూ.25కోట్ల వరకు ఫ్రాంచైజీలు బిడ్‌ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రికెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

రోహిత్‌ శర్మ..

టీమిండియా కెప్టెన్‌, ముంబయి ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం టీ20లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇటీవల కాలంలో రోహిత్‌ బ్యాట్‌తో ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విధ్వంసక ప్లేయర్లలో రోహిత్‌ ఒకడు. అలాగే, బెస్ట్‌ కెప్టెన్లలో ఒకడూ. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ని అందించాడు రోహిత్‌. ఐపీఎల్‌లో వేలానికి వస్తే రూ.22కోట్ల వరకు ధర పలికే అవకాశాలున్నాయి.

హార్దిక్ పాండ్యాకు రూ. 27 కోట్లు

హార్దిక్ పాండ్యా ఈ మెగా వేలంలో రూ.27కోట్ల వరకు ధర పలికే ఛాన్స్‌ ఉన్నది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విధ్వంసక ప్లేయర్లలో పాండ్యా ఒక్కడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ వస్తుంటాడు. అలాగే, పేస్‌ బౌలర్‌ కూడా. పరిస్థితులకు తగినట్లుగా నాలుగు ఓవర్లు వేస్తుంటాడు. అలాగే, బెస్ట్‌ ఫీల్డర్‌ కూడా. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను విజేతగా నిలిపాడు. ప్రస్తుతం ముంబయి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మెగా వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలు పోటీపడి కోట్లు కుమ్మరించే అవకాశాలున్నాయి.

ఎంఎస్‌ ధోనీకి ఎంతంటే..?

మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ 2025 ఐపీఎల్‌లో అందుబాటులో ఉంటాడా? లేదా? ఇంకా స్పష్టత రాలేదు. 2025 ఒక్క సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను పలుసార్లు విజేతగా నిలిపాడు. ఈ సారి అన్‌క్యాప్డ్‌ కేటగిరిలో ధోని వేలంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూల్‌లోకి వస్తే మాత్రం పది ఫ్రాంచైజీలు పోటీపడే ఛాన్స్‌ ఉన్నది. 2024 సీజన్‌లో ధోనీ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసినా భారీగానే ప్రభావం చూపించాడు. కెప్టెన్సీతో పాటు వికెట్‌ కీపింగ్‌తో టాప్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దాంతో మాజీ కెప్టెన్‌ జట్టులోకి తీసుకునేందుకు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి.

మిగతా ఆటగాళ్లు..

కేఎల్‌ రాహుల్‌ రూ.17కోట్లు
శ్రేయాస్ అయ్యర్ – రూ. 15 కోట్లు
రిషబ్ పంత్ – రూ, 22 కోట్లు
సంజు శాంసన్ – రూ. 20 కోట్లు
శుభమాన్ గిల్ – రూ. 20 కోట్లు
అర్ష్‌దీప్ సింగ్ – రూ. 20 కోట్లు
మహ్మద్ సిరాజ్ – రూ. 15 కోట్లు
కుల్దీప్ యాదవ్ – రూ. 10 కోట్లు
రవీంద్ర జడేజా – రూ. 15 కోట్లు
అక్షర్ పటేల్ – రూ. 17 కోట్లు
సూర్యకుమార్ యాదవ్ – రూ. 23 కోట్లు
యుజ్వేంద్ర చాహల్ – రూ. 8 కోట్లు
రవిచంద్రన్ అశ్విన్ – రూ. 7 కోట్లు
యశస్వి జైస్వాల్ – రూ. 22 కోట్లు

Exit mobile version