KKR vs PBKS|వాట్ ఏ మ్యాచ్..భారీ ల‌క్ష్యాన్ని చేధించిన పంజాబ్.. ప్లేఆఫ్ ఆశ‌లు సజీవం

KKR vs PBKS| ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పుడు ప్ర‌తి మ్యాచ్ కూడా ఆయా జ‌ట్ల‌కి ఇంపార్టెంట్‌. ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్‌, కోల్‌క‌తా టీమ్‌లు దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకున్న‌ట్టే. ఇక మిగ‌తా ఒక స్థానం కోసం వేరే టీమ్‌లు పోటీ ప‌డుతున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్

  • Publish Date - April 27, 2024 / 06:35 AM IST

KKR vs PBKS| ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పుడు ప్ర‌తి మ్యాచ్ కూడా ఆయా జ‌ట్ల‌కి ఇంపార్టెంట్‌. ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్‌, కోల్‌క‌తా టీమ్‌లు దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకున్న‌ట్టే. ఇక మిగ‌తా ఒక స్థానం కోసం వేరే టీమ్‌లు పోటీ ప‌డుతున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించి చ‌రిత్ర‌లో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో అంత ల‌క్ష్యాన్ని చేధించిన జ‌ట్టు అనేదే లేదు. ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారింది అని చెప్పాలి. ప్ర‌తి బ్యాట్స్‌మెన్ కూడా బౌండ‌రీల మోత మోగించాడు.

మ్యాచ్‌లో ముందుగా కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఓపెన‌ర్స్ ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) చెల‌రేగి ఆడారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించ‌డంతో కేకేఆర్ భారీ ల‌క్ష్యాన్ని న‌మోదు చేసింది. ఈ స్కోరు చూసిన త‌ర్వాత ఎవరికైన గెలిచిన‌ట్టే అనే న‌మ్మ‌కం ఉంటుంది. కాని పంజాబ్ బ్యాట‌ర్స్ విజృంభించ‌డంతో 262 ప‌రుగుల ల‌క్ష్యం కూడా చిన్న‌బోయింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్) విధ్వంస‌ర ఇన్నింగ్స్ ఆడ‌డంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

టీ20 చరిత్ర‌లోనే ఇంత పెద్ద ల‌క్ష్యాన్ని చేజించింది లేదు. అయితే కేకేఆర్ బౌల‌ర్స్ ఏ స‌మ‌యంలో కూడా వారిని నిలువ‌రించ‌లేక‌పోయారు. పంజాబ్ కోల్పోయిన రెండు వికెట్స్ లో ఒక‌టి ర‌నౌట్ కాగా, మ‌రొక వికెట్‌ సునీల్ నరైన్ కి ద‌క్కింది. అయితే గతంలో 259 పరుగులతో సౌతాఫ్రికా పేరిట ఉన్న అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేయ‌డం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు నమోదైన మ్యాచ్ కూడా ఇదే. కేకేఆర్ 18 సిక్స్ లు బాదగా.. పంజాబ్ కింగ్స్ 24 కలిపి మొత్తంగా 42 సిక్స్ లు బాదారు. ఒక ఇన్నింగ్స్ లో 24 సిక్స్ లు న‌మోదు చేయ‌డం కూడా రికార్డే. మ‌రోవైపు ఈడెన్ గార్డెన్స్ లో అత్యధిక టీ20 స్కోరుతోపాటు నైట్ రైడర్స్ తన రెండో అత్యధిక స్కోరు సాధించింది. ఈ సీజన్లోనే నైట్ రైడర్స్ ఓ మ్యాచ్ లో 272 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

Latest News