Rohit Sharma| హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. రోహిత్ ఆటతీరు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వీలుంటే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు, ఫొటో దిగేందుకు అభిమానులు ఎంతగానో ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ లేడి అభిమాని రోహిత్ శర్మని ఆటోగ్రాఫ్ అడిగి చివరలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాలలోకి వెళితే న్యూజిలాండ్(New Zealand)తో గురువారం (అక్టోబరు 24) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత్ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఒక టెస్ట్ ఓడిపోగా, చివరి రెండు టెస్ట్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది.ఈ క్రమంలో పూణే(Pune) పిచ్‌పై రాణించేందుకు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు పుణెలో స్పిన్ పిచ్‌తో కివీస్‌ను దెబ్బతీయాలని యోచిస్తోంది. దాంతో ఆటగాళ్లు ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. టీమిండియా(India) ప్రాక్టీస్ సెషన్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చిన సమయంలో.. స్టేడియానికి వచ్చిన ఓ మహిళా అభిమాని రోహిత్ శర్మని ఆటోగ్రాఫ్ అడిగింది. ఆమె అడిగిన తీరుకి రోహిత్ ముచ్చటపడి ఆగి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కాని చివరలో ఆమె ఇచ్చిన ట్విస్ట్ రోహిత్ కంగు తినేలా చేసింది.
ముందు లేడీ ఫ్యాన్.. రోహిత్ భాయ్, దయచేసి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి. చాలా రోజుల నుంచి మీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తున్నాను అని అంటుండగా, రోహిత్ తాను వస్తున్నట్టు చెప్పాడు. ఇక ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో లేడీ ఫ్యాన్.. థాంక్యూ సో మచ్. నేను విరాట్ కోహ్లీ(Virat Kohli)కి పెద్ద అభిమానిని.. కోహ్లీ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పండి అని అనగా, అప్పుడు రోహిత్ శర్మ (నవ్వుతూ) సరే… చెబుతాను అని అన్నాడు. ఇక బెంగళూరు టెస్టులో భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటవడంతో సొంతగడ్డపై భారత్ జట్టు పరువు పోయినంత పని అయిపోయింది. దాంతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా జట్టు చాలా కసి మీదు ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
The Conversation of Rohit Sharma with a fan:
Fan – Rohit bhai, please give autograph.
Rohit:- I’m coming, wait.
Fan – Thank You so much. Virat Kohli ko bolna unki badi aayi hai (tell Virat that his big fan came here).
Rohit:- “I’ll tell Virat”. ❤️🥹pic.twitter.com/JcS1BCbUaV
— Tanuj Singh (@ImTanujSingh) October 22, 2024