SA vs AFG| వార్ వ‌న్ సైడ్.. ఆఫ్ఘ‌నిస్తాన్‌పై గెలిచి తొలిసారి ఫైన‌ల్‌కి సౌతాఫ్రికా

SA vs AFG| టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాలు నమోదు చేస్తూ.. సెమీస్ కు దూసుకొచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు సెమీస్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 11.5 ఓవర్లలో 56 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. ఇక 57 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా జ‌ట్టు కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌

  • Publish Date - June 27, 2024 / 08:22 AM IST

SA vs AFG| టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాలు నమోదు చేస్తూ.. సెమీస్ కు దూసుకొచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు సెమీస్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 11.5 ఓవర్లలో 56 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. ఇక 57 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా జ‌ట్టు కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి 8.5 ఓవ‌ర్లో చేధించింది. దీంతో తొలిసారి సౌతాఫ్రికా జ‌ట్టు తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ కప్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టింది. డికాక్(5) పరుగుల‌కే ఔటైన ఆ త‌ర్వాత మార్క్ర‌మ్( 23 నాటౌట్‌) , హెండ్రిక్స్( 29) ప‌రుగులు మరో వికెట్ ప‌డ‌కుండా ల‌క్ష్యాన్ని చేధించారు. మూడు ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన జాన్సెన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ద‌క్కింది.

ఇక మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ కాగా, అందులో ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో నాకౌట్‌లో ఇంత త‌క్కువ స్కోరు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.

ఇక టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లను ఓడించి ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు. టోర్నీ ఆరంభం నుంచి అదిరిపోయే శుభారంభాలు ఇస్తున్న ఆఫ్గాన్ ఓపెనర్లు బ్రియన్ లారా స్టేడియంలో జరిగిన‌ మ్యాచ్ లో మాత్రం విఫలం అయ్యారు. తొలి ఓవర్లోనే గుర్బాజ్(0)ను పెవిలియన్ కు పంపి షాకిచ్చిన మార్కో జాన్సన్, ఆ తర్వాతి ఓవర్లోనే గుల్బాదిన్ నైబ్(9)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. వరల్డ్ కప్ ఫైనల్ కు చేరాలన్న కల చెదిరినట్లు అయ్యింది.

Latest News