IND vs SA Women Criket | దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్​లో మనమ్మాయిల విధ్వంసం

దక్షిణాఫ్రికా(South Africa)తో చెన్నైలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత(India Women) అమ్మాయిలు  వీరవిహారం చేసారు.  తొలి రోజే రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. కిల్లర్​ షెఫాలీ వర్మ(Shafali Varma)విధ్వంసానికి తోడు స్మృతి మంధాన( Smriti Mandhana) చూడచక్కని ఇన్నింగ్స్ జత కావడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. షెఫాలీ డబుల్​ సెంచరీతో చెలరేగగా, స్మృతి సెంచరీతో కదం తొక్కింది.

  • Publish Date - June 28, 2024 / 11:36 PM IST

మహిళా టీమిండియా టెస్ట్​ క్రికెట్​లో చరిత్ర సృష్టించింది(India Women Criket team creates History). జట్టు  ఓపెనర్లు కదం తొక్కి భారీ స్కోరుకు బాటలు వేశారు. షెఫాలీ వర్మ మిరుమిట్లు గొలిపే డబుల్ సెంచరీ(Double Century)తో రెచ్చిపోగా,  స్మృతి మంధాన తనదైన శైలిలో (Century) శతక్కొట్టింది. దీంతో ఆట మొదటిరోజే  భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోరు చేసి రికార్డు సృష్టించింది(525/4 First Day Stumps). మహిళల క్రికెట్‌లో ఒకేరోజూ అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత జట్టు చరిత్ర సృష్టించింది(Highest score in single day). అమ్మాయిల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగానూ షెఫాలీ-స్మృతి తమ పేర రికార్డు రాసుకున్నారు. ఇలా తొలి రోజే ఎన్నో రికార్డులు సృష్టించిన టీమిండియా, భారీ విజయంపై కన్నేసింది.

టాస్‌ గెలిచిన భారత జట్టు(India Women) మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌ నుంచే దక్షిణాఫ్రికా(SA W) బౌలర్లపై  ఓపెనర్లు షెఫాలీ వర్మ,  స్మృతి మంధాన విరుచుకుపడ్డారు. వీరి జోరు చూస్తుంటే టెస్టా, వన్డేనా అనిపించింది.  తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 292 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని  నమోదు చేశారు. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో మొదటి వికెట్​కు ఇదే అత్యధిక భాగస్వామ్యం(Highest 1st wicket partnership) కావడం విశేషం.  క్రీజులో కుదురుకున్నాక మంధాన వన్డే తరహాలో రెచ్చిపోయింది. కేవలం 78 బంతుల్లో 50 పరుగులను పూర్తి చేసుకుంది. షెఫాలీ వర్మ కూడా 66 బంతుల్లోనే అర్ధ శతకం సాధించింది. వీరిద్దరూ ఎంతకీ అవుటవకపోవడంతో దక్షిణాఫ్రికా చేష్టలు దక్కినట్లు చూస్తుండిపోయింది. ఏడుగురు బౌలర్లను వాడినా, ఈ జోడిని విడదీయలేకపోయారు. లంచ్​ సమయానికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా భారత్​ 130 పరుగులు చేసింది. తిరిగివచ్చాక కూడా అదే ఊపు కొనసాగింది. 31 ఓవర్లలోనే టీమిండియా 150 పరుగులు చేసింది. ముందుగా షెఫాలీ 113 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం సాధించగా, ఆ తర్వాత కాసేపటికే స్మృతి కూడా సెంచరీ చేసింది. 122 బంతుల్లో 19 ఫోర్లతో మంధాన సెంచరీ చేసింది. స్మృతికి టెస్టుల్లో ఇది మూడో శతకం కావడం విశేషం. ఎట్టకేలకు 292 పరుగుల వద్ద మంధాన అవుటైంది. 161 బంతుల్లో 149 పరుగులు చేసిన మంధానను డెల్మీ టక్కర్‌ అవుట్‌ చేసింది. భారత ఓపెనింగ్ జోడిని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లకు 52 ఓవర్లు కావాల్సివచ్చాయి.

స్మృతి అవుటయినా కూడా షెఫాలీ విధ్వంసం ఆగలేదు. 194 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సర్లతో షెఫాలీ తొలి డబుల్‌ సెంచరీ(Shafali Verma First Double Ton) నమోదు చేసింది. డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే 205 పరుగుల వద్ద షెఫాలీ రనౌట్ అయింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్Jemima Rodrigues (55) పరుగులు చేయగా, అంతకుముందు సతీశ్​ శుభ(15)  చేసి అవుటైంది.  జెమీమాకు  టెస్టుల్లో ఇది మూడో అర్ధ శతకం. ప్రస్తుతం కెప్టెన్​ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(Harmanpreet Kaur) 42,  కీపర్​ రిచా ఘోష్‌ (Richa Gosh)43 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి  భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. రేపు రెండవ రోజు ఈ ఇద్దరు బ్యాటర్లు అవుటవకుండా ఉంటే మరిన్ని రికార్డులు ఖాయం.

READ MORE 

భారత అమ్మాయిలు నెలకొల్పిన రికార్డులు ఇవే

Rohith Sharma చరిత్రలో మొదటిసారి : రోహిత్​శర్మ ఒకే రోజు మూడు రికార్డులు

 

Latest News