దక్షిణాఫ్రికా(South Africa)తో ఈరోజు మొదలైన ఏకైక టెస్ట్‌మ్యాచ్(Only Test Match)లో భారత అమ్మాయిలు(India Women) అదరగొట్టారు. ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఇంకో ఇద్దరు అర్థ సెంచరీలకు దగ్గర్లో ఉన్నారు. ఈ క్రమంలో మహిళా టెస్ట్ క్రికెట్లో పలు రికార్డులు బద్డలు కాగా, మరికొన్ని కొత్తగా నమోదయ్యాయి. History created by India Women.
- 500 Runs in single day: ఒక్కరోజులో మహిళా క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు, 1935లో ఇంగ్లండ్, న్యూజీల్యాండ్ కలిసి ఒకరోజులో 475 పరుగులు చేసాయి. ఇప్పటి దాకా అదే అత్యధిక ఒకరోజు పరుగుల మొత్తం.
- India’s highest Score: భారత మహిళల జట్టు సాధించిన 525 పరుగులే ఇప్పుడు వారి అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 2002లో సాధించిన 467 ఆలౌట్ వారి అత్యధికం. ప్రస్తుతానికి అన్ని జట్లలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది.
- Shafali’s 205 is single day highest: షఫాలీ వర్మ ఒక రోజులో చేసిన 200లకు పైగా పరుగులే ఇప్పుడు అత్యధికం. ఇంతకుముందు 1935లో న్యూజీల్యాండ్‌పై ఇంగ్లండ్‌కు చెందిన బెట్టీ స్నోబాల్ చేసిన 189 పరుగులు అత్యధిక స్కోరుగా ఉండేది.
- Shafali – Smriti’s Highest Opening Stand: షఫాలీ – మంధానల 292 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమే మహిళా క్రికెట్లో అత్యధికం. 2004లో పాకిస్తాన్ జంట కిరణ్ బలూచ్, సజ్జిదా షా వెస్టిండీస్‌పై నెలకొల్పిన 242 పరుగులదే ఇప్పటిదాకా రికార్డు. అలాగే ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యుత్తమం. 1987లో అస్ట్రేలియాకు చెందిన డెనిస్ అనెట్స్, లిండ్సే రీలర్ల జంట ఇంగ్లండ్‌పై మూడో వికెట్‌కు అత్యధికంగా 309 పరుగులు జోడించారు.
- India’s highest partnership: భారత్‌కు కూడా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకుముందు ఇదే సౌతాఫ్రికాపై 2014లో తిరుష్ కామిని, పూనమ్ రౌత్‌ల జంట చేసిన 275 పరుగుల రికార్డును షెఫాలీ–మంధానల జంట తుడిచిపెట్టింది.
- Fastest Double Century – Shafali Verma: మహిళల టెస్ట్ క్రికెట్లో షఫాలీ వర్మ 194 బంతుల్లో చేసిన డబుల్ సెంచరీనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. ఈ ఏడాదిలోనే అస్ట్రేలియాకు చెందిన అనబెల్ సదర్‌ల్యాండ్ దక్షిణాఫ్రికాపై 248బంతుల్లో సాధించిన డబుల్ హండ్రెడ్ వేగవంతమైంది.
- Centuries by Openers second pair: ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించిన రెండో ఓపెనింగ్ జంటగా షెఫాలీ – స్మృతి రికార్డు సృష్టించారు. ఇంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన చార్లట్ ఎడ్వర్ట్స్, లారా న్యూటన్ న్యూజీల్యాండ్‌పై ఈ ఘనతను సాధించారు.
- Second Indian Woman to score a Double Hundred: షఫాలీ వర్మ డబుల్ సెంచరీ సాధించిన రెండవ భారత క్రికెటర్. మొదటగా మిథాలీరాజ్ ఇంగ్లండ్‌పై 2002లో 214 పరుగులు చేసింది.
- Second youngest Woman to score Double Century: మహిళల క్రికెట్లో అతి పిన్న వయసు(20 ఏళ్ల 152 రోజులు ఈనాటికి)లో డబుల్ సెంచరీ సాధించినవారిలో షెఫాలీ రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానం మిథాలీ రాజ్(19 ఏళ్ల 254రోజులు)ది. ఈ ఇద్దరూ భారత వనితలే కావడం విశేషం.
- Highest number of Sixes by Woman Cricketer – Shafali Verma: మహిళా క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో షెఫాలీ కొట్టిన 8 సిక్స్‌లే అత్యధికం. ఇంతవరకు ఎవరూ రెండు కంటే ఎక్కువ కొట్టలేకపోయారు. అసలు తన మొత్తం టెస్ట్ కెరీర్లోనే 3 కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టినవారే లేరు. షెఫాలీ ఇప్పటివరకు 13 సిక్స్‌లు బాదింది. అందరికంటే 10 సిక్స్‌లు ఎక్కువ.
- 9 Sixes by Shafali-Smrithi is highest: ఇవాళ షఫాలీ – మంధానలు కొట్టిన సిక్స్‌లు అసలు రెండు టీమ్‌లు కలిపి కూడా ఇన్ని సిక్స్‌లు ఎవరూ, ఎప్పుడూ కొట్టలేదు. పాత రికార్డు 6 సిక్స్‌లు, అది కూడా భారత, ఇంగ్లండ్ జట్లు కలిపి.
READ MORE
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్‌లో మనమ్మాయిల విధ్వంసం