Rohith Sharma చరిత్రలో మొదటిసారి : రోహిత్​శర్మ ఒకే రోజు మూడు రికార్డులు

రోహిత్​ శర్మను హిట్​మ్యాన్​ అని ఎందుకంటారో మరోసారి రుజువు చేసాడు. మిచెట్​ స్టార్క్​, హేజిల్​వుడ్​ లాంటి అరివీర భయంకరుల బౌలింగ్​లో 8 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడి, కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసాడు. అవుటయ్యేటప్పటికి అతని స్ట్రైక్​ రేట్​ 224.39.

  • Publish Date - June 25, 2024 / 07:44 AM IST

హిట్​మ్యాన్​(Hitman) రోహిత్​ శర్మ(Rohit Sharma) ఈరోజును తన పేర లిఖించుకున్నాడు. సెయింట్​ లూసియాలో నేడు జరిగిన సూపర్​ 8 మ్యాచ్​లో,  ఈ భారత కెప్టెన్​, ఆస్ట్రేలియా ఘనాపాఠీ బౌలర్లను చీల్చి చెండాడి, వారికి చెత్త రికార్డులను అంటగట్టాడు. తన పేరున మూడు సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు( 3 Records created). 8 సిక్సర్లు, 7 ఫోర్లతో కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు సాధించి బీభత్సమైన స్ట్రైక్​ రేట్​(224.39)తో తన ఇన్నింగ్స్​ను ముగించాడు. ఈ క్రమంలో రోహిత్​ మూడు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

మొదటిది, అంతర్జాతీయ టి20ల్లో 200 సిక్సర్లను బాదిన మొదటి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు. అలాగే ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్స్​లు కొట్టిన బ్యాటర్​గా కూడా రికార్డు సాధించాడు.

ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ సాధించిన రికార్డులు:

1. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు(Rohit Sharma – most runs in T20I cricket) : 4165 పరుగులతో మొదటి స్థానం. రెండవ స్థానంలో బాబర్ ఆజం(4145), మూడో స్థానంలో కోహ్లీ(4103) ఉన్నారు.

 

2. 200 సిక్సర్లతో అంతర్జాతీయ టి20ల్లో మొదటి స్థానం(Rohit Sharma is now the the first player to hit 200 sixes in T20 Internationals).

3. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా కూడా మొదటి స్థానం(Most sixes vs an opponent in all International cricket). అస్ట్రేలియాపై 132 సిక్సర్లు. రెండో స్థానంలో క్రిస్ గేల్ (130, ఇంగ్లండ్పై), మూడో స్థానంలో రోహిత్ శర్మ(88, వెస్టిండీస్పై)

4. భారత్ తరపున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్థసెంచరీల్లో 5వ స్థానం. (1 – యువరాజ్ సింగ్ 12 బంతులు, ఇంగ్లండ్పై, 2– కెఎల్ రాహుల్ 18 బంతులు, స్కాట్ల్యాండ్పై, 3– సూర్యకుమార్ యాదవ్ 18 బంతులు, దక్షిణాఫ్రికాపై, 4 – గౌతం గంభీర్ 19 బంతులు, శ్రీలంకపై, 5 – రోహిత్ శర్మ 19 బంతులు, అస్ట్రేలియాపై)

5. టి20 ప్రపంచకప్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో రెండో స్థానం. (మొదటి స్థానం : సురేశ్ రైనా, 101 పరుగులు సౌతాఫ్రికాపై, రెండో స్థానం : రోహిత్ శర్మ, 92 పరుగులు ఆస్ట్రేలియాపై, మూడో స్థానం : విరాట్ కోహ్లీ, 89 నాటౌట్ వెస్టిండీస్పై)

 

6. టి20 ప్రపంచకప్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో రెండో స్థానం. (మొదటి స్థానం : క్రిస్ గేల్ 98 పరుగులు, భారత్పై, రెండో స్థానం : రోహిత్ శర్మ 92 పరుగులు, ఆస్ట్రేలియాపై, మూడో స్థానం : క్రిస్ గేల్ 88 పరుగులు, ఆస్ట్రేలియాపై)

Latest News