టి20 ప్రపంచకప్(T20 World Cup 2024) పోటీల్లో భాగంగా బార్బడోస్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది(India beat Afghanistan). టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఓపెనర్లు రోహిత్(8), కోహ్లీ(24) పరుగులు చేసి అవుటవ్వగా, పంత్(20), దూబే(10) మాత్రమే చేయగలిగారు. ఇన్నింగ్స్‌ను నిర్మించిందంటే సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav). ఓ పక్క వికెట్లు పడుతున్నా, తొణక్కుండా అఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పైచేయి సాధించాడు. సూర్యకు తోడుగా పాండ్యా(Hardhik Pandya) కూడా బ్యాట్ ఝుళిపించడంతో, చివరికి నిర్ణీత 20 ఓవర్లతో భారత్ 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది(India 181/8).
అఫ్ఘన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీ చెరో మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేసారు. నవీన్ఉల్హక్ ఒక వికెట్ తీసాడు.
182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా, అక్షర్ దెబ్బకు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 71 పరుగులకు 5 వికెట్లు సమర్పించుకున్న అఫ్ఘన్ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది(134 All out).
భారత బౌలర్లలో బుమ్రా, అర్షదీప్ చెరో 3 వికెట్లతో రాణించగా, కుల్దీప్ 2, అక్షర్, పాండ్యా తలా ఓ వికెట్ కూల్చారు. ముఖ్యంగా బుమ్రా (4–1–7–3) నిప్పుల్లాంటి బంతులేసి అఫ్ఘన్‌కు వణికించాడు.
దీంతో భారత్ 2 పాయింట్లు సాధించి, 2.35 నెట్ రన్ రేట్ తో టేబుల్ టాపర్‌గా నిలిచింది.