Rahul Dravid | టీ20 వరల్డ్ కప్ (T20 World cup)లో టీమిండియా (Team India) సూపర్-8 మ్యాచులకు సిద్ధమైంది. తొలి మ్యాచును బార్బడాస్ (Barbados) వేదికగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడున్నది. ఈ సందర్భంగా టీమిండియా బౌలింగ్ లైనప్‌లో కీలక మార్పులు చేయబోతున్నట్లుగా హెడ్ కోచ్ (Head Coach) రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సంకేతాలిచ్చారు. అమెరికాతో పోలిస్తే కరేబియన్ దివుల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌కు అవకాశం ఇచ్చే ఉందని చెప్పారు.
ఇప్పటి వరకు కుల్దీప్, చాహల్ బెంచ్‌కు పరిమితం కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ భారాన్ని మోశారు. అయితే, యూఎస్ఏలో పిచ్‌లు పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో స్పిన్నర్లు తడబడ్డారు. వికెట్లు తీయలేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆఫ్ఘన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరైన రాహుల్ ద్రవిడ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ క్రీడాకారుడిని పక్కనపెట్టడం చాలా కష్టమైన పని అన్నారు. న్యూయార్క్ పేస్ బౌలర్లకు అనుకూలించిందని.. కానీ బార్బడాస్‌లో పరిస్థితులకు తగినట్టు టీమిండియాలో మార్పులు అవకాశం కావచ్చన్నారు.
చాహల్, కుల్దీప్‌లను రంగంలోకి దింపే ఛాన్స్ ఉందని.. ఆల్ రౌండర్లుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లు టీమిండియాలో ఉండడం తమ అదృష్టమన్నారు. తమ దగ్గర ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ బౌలింగ్‌కు సంబంధించి ఏడుగురు అందుబాటులో ఉన్నారని ద్రవిడ్ చెప్పుకువచ్చాడు. ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకమైందని.. ఇలాగే ఉండాలని ఆశించలేమన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారాలని తాను భావిస్తానని.. అందుకే అక్షర్ పటేల్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
రిషబ్‌ను నెంబర్ 3లో పంపే విషయంలో చాలా ఆలోచించాల్సి వచ్చిందన్నారు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి మార్పులకు అవకాశం ఉండదని.. ఎవరిని ఏ స్థానంలో ఆడించాలన్న అంశానికి టీ20ల్లో ప్రాధాన్యం ఎక్కువన్న రాహుల్.. ఇలాంటి ఈ మధ్య తరచూ జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన కుల్దీప్, యజువేంద్రతో పాటు బెంచ్‌కు పరిమితమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్ వరల్డ్ కప్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు నిరీక్షిస్తున్నారు. అయితే, బ్యాటర్ల విషయంలో మాత్రం టీమిండియా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని తెలుస్తున్నది.