Vaibhav Suryavanshi centuri| వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

అండర్-19 అసియా కప్ వన్డే టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ(171)తో అదరగొట్టాడు. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 14సిక్సర్లు, 9ఫోర్ల సహాయంతో 171పరుగులు చేసి విధ్వంసం సాగించాడు.

విధాత : అండర్-19 అసియా కప్ వన్డే టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi )సూపర్ సెంచరీ(171, 14సిక్సర్లు, 9ఫోర్లు)తో అదరగొట్టాడు. యూఏఈతో తలపడుతున్న భారత్ జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ , కెప్టెన్ ఆయుష్ మాత్రే (4) పరుగులకే ఔటైనప్పటికి..మరో ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ధనాధన్ బ్యాటింగ్ తో 20ఓవర్ల లోపే సెంచరీ(100) పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా వైభవ్ తన విధ్వంసాన్ని కొనసాగించి 32.5 ఓవర్లలో జట్టు స్కోర్ 265 పరుగులకు చేరుకున్న క్రమంలో వ్యక్తిగత స్కోర్171 పరుగుల వద్ద ఔటయ్యాడు.

వైభవ్ దూకుడు చూస్తే డబుల్ సెంచరీ ఖాయమనుకున్న దశలో అతడు సూరి బౌలింగ్ లో మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆర్యన్ జార్జ్ 69పరుగులకు ఔటయ్యాడు.
వినయ్ మల్హోత్ర(14) పరుగులతో, వేదాంత త్రివేది(4)పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరో 17ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది.

Latest News