విధాత: ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు 673 పరుగులతో సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ 674పరుగులతో అధిగమించాడు. న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరి కూడా బాదడం ద్వారా వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసి ఈ ఫార్మట్‌లో సచిన్ 49సెంచరీల రికార్డును అదిగమించాడు. భారత్ ఇన్నింగ్స్ 41.3కు చేరుకున్న సమక్షంలో 106 బంతుల్లో 100పరుగులు చేశాడు. అలాగే వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్ మూడవ వాడు. అతను రికి పాంటింగ్ రికార్డును అధిగమించాడు. కాగా కోహ్లీ తన వన్డే కేరిర్‌లో 71హాప్ సెంచరీలు, 50సెంచరీలు నమోదు చేశాడు. 291ఇన్నింగ్‌లో అట కొనసాగుతున్న సమయానికి 13,777పరుగులు చేశాడు.