Virat Kohli : కోహ్లీ ఇన్‌స్టా ఖాతా మాయం.. గందరగోళంలో ఫ్యాన్స్‌.. విరాట్‌ ఎక్కడ..? అంటూ అనుష్కకు ప్రశ్నలు

కింగ్ కోహ్లీ ఇన్‌స్టా ఖాతా మాయం! 270 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అకౌంట్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ గందరగోళం. అనుష్క శర్మకు ప్రశ్నల వర్షం.. అసలేం జరిగిందంటే?

Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా (Team India)లో టాప్ బ్యాటర్‌ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కింగ్‌ కోహ్లీనే. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఈ రన్‌ మెషీన్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో కోహ్లీకి ఏకంగా 270 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి కోహ్లీ ఇన్‌స్టా ఖాతా ఒక్కసారిగా స్తంభించిపోయింది (Instagram Account Disappearing).

అకౌంట్‌ను యూజర్లు యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ‘ప్రొఫైల్‌ ఈజ్‌నాట్‌ అవైలబుల్‌’ అన్న సందేశం దర్శనమిచ్చింది. దీంతో తమ అభిమాన నటుడి ఇన్‌స్టా ఖాతా మాయమవడంపై నెటిజన్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పారేమో అని ఆందోళన చెందారు. ఈ మేరకు నెట్టింట ‘కోహ్లీ ఇన్‌స్టా ఖాతాకు ఏమైంది..?’ వంటి పోస్టులు వైరల్‌ చేశారు. అదే సమయంలో ‘కోహ్లీ ఎక్కడ..?’, ‘కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్‌ ఏమైంది..?’ అంటూ ఆయన భార్య అనుష్క శర్మను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కోహ్లీ ఎక్స్‌ ఖాతా మాత్రం యాక్టివ్‌లోనే ఉంది. ఇదిలా ఉండగా.. విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్‌ కూడా మాయమైపోయింది. ఆ తర్వాత కాసేపటికి కోహ్లీ ఇన్‌స్టా ఖాతా యాక్టివ్‌లోకి వచ్చింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, కోహ్లీ ఇన్‌స్టా ఖాతాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. బ్రాండ్‌ ప్రొమోషన్స్‌, క్రికెట్‌, వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కోహ్లీ పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి. అంతేకాదు ఇన్‌స్టా ద్వారా కోహ్లీ భారీగానే ఆదాయం పొందుతున్నాడు. ప్రతి స్పాన్సర్డ్‌ పోస్ట్‌కి కోహ్లీ రూ.కోట్లల్లో ఛార్జ్‌ చేస్తాడని టాక్‌. ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్‌ 20 స్టార్స్‌ జాబితాలో కోహ్లీ కూడా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ 1.38 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అంటే ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ సంపాదన రూ.11.45 కోట్లన్న మాట. అలాంటిని కోహ్లీ ఇన్‌స్టా ఖాతా కనిపించకపోవడంతో ఫ్యాన్స్‌ ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే అది రిస్టోర్‌ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కోహ్లీ ఇన్‌స్టా ఖాతా ఎందుకు స్తంభించిపోయిందన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి :

Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?
Journalist Pension | జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త‌.. పెన్ష‌న్‌ రూ. 13 వేల‌కు పెంపు

Latest News