Virat Kohli | స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ లవర్స్( Cricket Lovers )ను షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో టీమిండియా( Team India )కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్.. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాలు ఇవే అంటూ రకరకాల కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీడాభిమానులతో విరాట్ కోహ్లీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. తన స్కూల్ డేస్( School Days )ను గుర్తు చేసుకున్నాడు. అది ఏంటంటే.. తన పదో తరగతి మార్కుల మెమో( Tenth Marks Memo )ను సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేశాడు. ఇటీవల CBSE టెన్త్ రిజల్ట్స్ వెలువడిన సందర్భంగా కోహ్లీ మార్క్‌షీట్( Virat Kohli Tenth Mark Sheet ) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మార్క్‌షీట్ ద్వారా అతను విద్యార్థులకు ఓ ఇన్‌స్పిరేషనల్ మెసేజ్‌ను అందించాడు. కేవలం మార్కులు మాత్రమే లైఫ్‌లో సక్సెస్‌ను నిర్ణయించవని.. పట్టుదల, డెడికేషన్ ముఖ్యమని చెప్పాడు.
2004లో ఢిల్లీలోని సేవియర్ కాన్వెంట్ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంగ్లీష్‌లో 83 మార్కులతో ఏ1 గ్రేడ్, సోషల్ సైన్స్‌లో 81 మార్కులతో ఏ2 గ్రేడ్ సాధించాడు. హిందీలో 75 మార్కులతో బీ1, సైన్స్‌లో 55 మార్కులతో సీ1, మ్యాథ్స్‌లో 51 మార్కులతో సీ2, ఇంట్రడక్టరీ ఐటీలో కూడా 74 మార్కులతో సీ2 గ్రేడ్ సాధించాడు. మొత్తంగా 69.8% స్కోర్‌తో పాసయ్యాడు. దీన్ని బట్టి అతడు అకడమిక్స్‌లో యావరేజ్ స్టూడెంట్ అనే విషయం స్పష్టమవుతోంది. కానీ, అతడి క్రికెట్ పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. అందుకే అకడమిక్స్‌కి లైఫ్‌లో సక్సెస్‌కి మధ్య ఎలాంటి సంబంధం లేదు.
చదువుల్లో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ.. మైదానంలో మాత్రం పరుగుల వర్షం కురిపించాడు. మ్యాథ్స్‌లో వీక్ అయినప్పటికీ.. తన పరుగులను లెక్కించలేని స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌కు అకడమిక్స్‌లో ఎలాంటి ఇంపార్టెన్స్ లేకపోయినా అవే తన కెరీర్‌ను, లైఫ్‌ను మలిచాయని చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ గణాంకాలు చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయి. కెప్టెన్‌గా, టెస్ట్ ఫార్మాట్‌లో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ విజయాలు నమోదు చేశాడు. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోపాటు అనేక ఇతర దేశాలపై పరుగుల వర్షం కురిపించాడు. అలాగే, 2016 నుంచి 2019 వరకు, టెస్ట్ మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 7 డబుల్ సెంచరీలు వచ్చాయి.
ఇది మాత్రమే కాదు, కెప్టెన్‌గా అతను స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్‌లోనూ ఓడిపోలేదు. అదే సమయంలో విదేశీ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలకు వారి సొంత గడ్డపై కఠినమైన సవాల్ ఇచ్చాడు. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 40 గెలిచి 17 మాత్రమే ఓడిపోయాడు. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
