విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని శిల్పారామంలో నిర్మాణ్ ఓఆర్‌జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు నైపుణ్యంతోపాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరిజ్ఞానం అవసరమని తెలిపారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందాలంటే పిల్లలకు మంచి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. టాస్క్, అమరరాజా, సెట్విన్ సంస్థలలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని, అన్ని విధాలా వారికి సహాకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ‘ఫస్ట్ ‘ఆధ్వర్యంలో వేయి మంది మహిళలకు వివిధ కోర్సుల్లో ఇప్పటికే నైపుణ్య శిక్షణ అందించినట్లు యెన్నం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ లు కలిసి పనిచేస్తేనే ఉద్యోగాలు సృష్టించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ‘ఫస్ట్’ పర్యవేక్షకులు మనోహర్, శ్రీనివాసులు, శ్రీనివాస్, శివ, నవత తదితరులు పాల్గొన్నారు
యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని శిల్పారామంలో నిర్మాణ్ ఓఆర్‌జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Latest News
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం..
దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు
వారణాసి’పై అంచనాలు పీక్స్‌కి..
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ముంబైలో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం..
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్‌లో 'స్టెమ్ సెల్' ల్యాబ్ ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి