Site icon vidhaatha

నిప్పుల కొలిమి.. 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 46.8 డిగ్రీలు

విధాత: తెలంగాణపై సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రమంతా నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే వేడి గాలులు వీస్తున్నాయి. వేడి గాలులు రాత్రి పూట కూడా వీస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలోని సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోని 43 ప్రాంతాల్లో వడగాలులు వీచినట్లు టీస్ డీపీ ఎస్ వెల్లడించింది.

ఇందులో మద్దూర్, మర్కూక్,బంట్వారం గ్రామాల్లో తీవ్రంగా వడగాలులు వీచాయి. కాగా రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్ లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నయోదైంది. వేసవిలో వడగాలులు వీచే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ల వద్దని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేందుకు చల్లటి వాతావరణంలో ఉండడంతోపాటు ఎక్కువ మంచి నీరు తాగాలని సూచించింది. కాగా రాగల ఐదు రోజుల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Exit mobile version