హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమం

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ వెంటనే హామీలు అమలుచేయాలని ఇందిరా పార్క్ వద్ద శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

  • Publish Date - June 15, 2024 / 06:58 PM IST

కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సాధనకు గ్రామాల్లోకి

ఆత్మగౌరవం, అధికారం కోసం బి.సి లు మిలిటెంట్ ఉద్యమాలు

బీసీ సంఘాల నాయకుల పిలుపు

విధాత ప్రత్యేక ప్రతినిధి:

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ వెంటనే హామీలు అమలుచేయాలని ఇందిరా పార్క్ వద్ద శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, రాజారామ్ యాదవ్, సాయిని నరేందర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాపోలు ఆనంద భాస్కర్, పుటం పురుషోత్తం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఈ దేశ పాలకులు బి.సి లను బిక్షగాళ్ళను చేసారని అన్నారు. బి.సి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బి.సి లకు నష్టం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర, హక్కుల కోసం రక్తం చిమ్మిన తెలంగాణ నేలపై బి.సి లకు ఉందన్నారు. బీసీలకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు.

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల నుండి చట్ట సభల వరకు అన్ని స్థాయిల్లో బి.సి లకు అవకాశాలు రావలంటే సమగ్ర కుల జనగణన అవసరమన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వానికి రెండు కాళ్ళు లేకుండా, ఉత్తరప్రదేశ్ లో బిజెపి దుర్మార్గాన్ని తిప్పికొట్టి, దేశ ప్రధానికీ ఓటమి చెమటలు పట్టించిన శక్తి బి.సి లదని ఆయన అన్నారు.

బిఆరెఎస్ నాయకులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల రాజ్యాంగంలో బి.సి కమీషన్లు వేసుకునే అవకాశం వచ్చిందని, నెహ్రూ నాయకత్వంలో కాకా కలేల్కర్ కమీషన్ నివేదిక, ఇందిరా నాయకత్వంలో మండల్ కమీషన్ నివేదికను బుట్టదాఖలు చేశారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మేకల కృష్ణ, సాయిని నరేందర్, బత్తుల సిద్ధేశ్వర్లు, సర్దార్ పుటం పురుషోత్తం, గౌరీ శంకర్, ముఠా జయసింహ, కొల్లూరు సత్యనారాయణ, చాపర్తి కుమార్ గాడ్గే, వళ్ళాల జగన్ గౌడ్, పొన్నం మహేశ్ గౌడ్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు న్యాయవాది గుండ్రాతి శారద గౌడ్ ఏటిగడ్డ అరుణ, అచ్చ నాగమణి, శ్రీహరి యాదవ్, దేశం మహేష్ గౌడ్, దత్తాత్రేయ, బట్టు శ్రీధర్, వజ్జ ధనుంజయ, కరుణాకర్ ముదిరాజ్, జైహింద్ గౌడ్, అశోక్ పోచం, నాగేందర్ గౌడ్, నిమ్మల వీరన్న, అంబాల నారాయణ గౌడ్, అశోక్ యాదవ్, కిరణ్ కుమార్, గుండ్రాతి శారద గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ నాయక్, రాంచందర్ నాయక్, హరిప్రసాద్, లింగం శాలివాహన, రత్నం చారి, ఐలేశ్ యాదవ్, గంటా రాములు యాదవ్, రాజు గౌడ్, మధు, నాగారపు సత్యం యాదవ్, గిరబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతరబోయిన రాజయ్య, బద్దుల రాజ్ కుమార్, నానబోయిన రవి, దాసరి కోటి తదితరులు పాల్గొనగా పోచబోయిన శ్రీహరి యాదవ్ వందన సమర్పణ తెలిపారు.

*

Latest News