విధాత : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూ టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ వీడియో విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, రాహుల్ గాందీలకు సుమన్ ధన్యవాదాలు తెలిపారు.
నవీన్ యాదవ్ మంచి యువకుడని..సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని..అతనికి మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ కు అందరు మద్దతునిచ్చి.. భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లకు సుమన్ విజ్ఞప్తి చేశారు.