విధాత, వరంగల్ ప్రతినిధి: ఆన్‌లైన్ బెట్టింగ్ యువకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. వరుస సంఘటనలతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగుతుంది. తాజాగా బెట్టింగ్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగులో ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో సోమవారం జరిగింది.
జిల్లాలోని రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన దేవర రాజు (38) గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతున్నాడు. బెట్టింగ్‌కు అలవాటుపడిన రాజు ఇటీవల బెట్టింగ్ కు పాల్పడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.