Site icon vidhaatha

Beans | ‘బీన్స్’ ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. కిలో రూ. 200..!

Beans | కూర‌గాయ‌ల( Vegetables ) ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. వెజ్ బిర్యానీ( Veg Biryani )లు, ఫ్రైడ్ రైస్ వంటి వంట‌కాల్లో నిత్యం ఉప‌యోగించే బీన్స్( Beans ) ధ‌ర‌లు ఆకాశ‌న్నాంటాయి. అస‌లు బీన్స్ కొందామంటేనే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కిలో బీన్స్ ధ‌ర ఏకంగా రూ. 200 పైనే ప‌లుకుతోంది.

హ‌నుమకొండ రైతు బ‌జార్‌తో పాటు బ‌య‌ట మార్కెట్‌లో కిలో బీన్స్ ధ‌ర రూ. 200 ప‌లుకుతోంది. ఇర‌వై రోజుల క్రితం బీన్స్ ధ‌ర కిలో రూ. 100 ఉండ‌గా, వారం రోజుల క్రితం రూ. 130 వ‌ర‌కు చేరింది. కాగా నాలుగు రోజుల నుంచి రూ. 200ల‌కు విక్ర‌యిస్తున్నారు. శుక్ర‌వారం బాల‌స‌ముద్రంలోని రైతుబ‌జార్, కేయూ జంక్ష‌న్, గోపాలాపూర్ మార్కెట్ల‌లోనూ రూ. 200ల‌కు కిలో బీన్స్‌ను విక్ర‌యించారు. ఇక హైద‌రాబాద్‌లోని ప‌లు రైతు బ‌జార్ల‌లో కిలో బీన్స్ ధ‌ర రూ. 150కి పైగా ప‌లుకుతోంది. ఈ క్ర‌మంలో బీన్స్ కొనేందుకు గృహిణులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇక మిగ‌తా కూర‌గాయ‌ల ధ‌ర‌లు రూ. 60 నుంచి 70 లోపు ఉన్నాయి. బీన్స్‌ను బెంగ‌ళూరు త‌దిత‌ర ప్రాంతాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నారు.

Exit mobile version